Monday, June 16, 2025
spot_img

కన్నుల పండుగగా “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2024” వేడుక

Must Read

ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు.

14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు.

❇️ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు.

❇️ ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ గారికి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నం గారికి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీసుకుమార్ గారికి, నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావు గారికి, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ గారికి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్ గారికి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ గారికి, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ గారికి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు.

❇️ ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్ గారు, ఎంఎం కీరవాణి గార్లను ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్ కు అందజేశారు.

❇️ సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News

ఇరాన్‌లోని మన దేశ పౌరులకు సూచనలు

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS