భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 15) ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప్రాంగణంలో ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట దారి సాధారణ వాహనాలకు పూర్తిగా మూసివేయబడుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలులో ఉంటాయి.
మళ్లింపులు:
- సెవెన్ టూంబ్స్ దిశ నుంచి వచ్చే వాహనాలు జమాలి దర్వాజా వైపు మళ్లించబడతాయి.
- GHMC గ్రౌండ్, GHMC ఐల్యాండ్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మోతీ మహల్ ఎక్స్ రోడ్ వైపు పంపిస్తారు.
- బడా బజార్ నుంచి వచ్చే వాహనాలను GHMC ఐల్యాండ్ వైపు మళ్లిస్తారు.
- నార్సింగి, టిప్పు ఖాన్ వంతెనల వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ రాందేవ్‌గూడ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది.
పార్కింగ్ ఏర్పాట్లు:
- వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాలా హిస్సార్ – బడా బజార్ మసీదు మధ్య ప్రత్యేక పార్కింగ్.
- ప్రభుత్వ సీనియర్ అధికారులకు గోల్కొండ బస్ స్టాప్ వద్ద.
- ఇతర ప్రముఖులకు ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద.
- మీడియా ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు ఏరియా హాస్పిటల్‌లో.
సాధారణ ప్రజలకు సెవెన్ టూంబ్స్, డెక్కన్ పార్క్, హుడా పార్క్ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం.