ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.
అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.
ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.
ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..
ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..
అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.
అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.
అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.
తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.
ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..
లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..
ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..
దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతే
వినాశనం తప్పదు.. తస్మాత్ జాగ్రత్త
Must Read