Monday, July 28, 2025
spot_img

పిల్లల కోసం.. ట్రంప్ పథకం..

Must Read

అగ్రరాజ్యం అమెరికాలో పుట్టే పిల్లల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. 2025-29 మధ్య కాలంలో జన్మించేవారి పేరిట వెయ్యి డాలర్ల పెట్టుబడి ఖాతాను ప్రభుత్వమే ఫ్రీగా తెరుస్తుంది. వీటినే ట్రంప్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాలను పిల్లల తల్లిదండ్రులే నిర్వహిస్తారని చెప్పారు. పేరెంట్స్ ఈ అకౌంట్లలో ప్రైవేట్ కంట్రిబ్యూషన్ కింద సంవత్సరానికి 5 వేల డాలర్ల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నిధులు ముందు తరాల దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ట్రంప్ పేర్కొన్నారు. పిల్లలకు 18 ఏళ్లు నిండే దాక వడ్డీ జమ చేస్తారు. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్ ఆథరైజేషన్‌తోపాటు సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు. సెనేట్‌లో పాస్ అవ్వాలి. కానీ అక్కడ అంత సులభం కాదని అంచనా వేస్తున్నారు.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS