Wednesday, July 23, 2025
spot_img

మైనింగ్‌ రద్దు కేవలం కాగితాల్లోనేనా ..

Must Read
  • క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు
  • భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి
  • అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం
  • క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్‌
  • క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్‌

పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్‌ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్‌కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ అక్రమంగా కంకర రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈతతంగం అంతా జిల్లా ఉన్నతాధికారుల నుండి సంబంధిత మైనింగ్‌ అధికారులకు తెలియని విషయం కాదు అని కాంట్రాక్టర్‌ అమర్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు మంగళవారం తోగ్గూడెం క్రషర్ల వద్ద లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.

మైనింగ్‌ మాఫియాపై కాంట్రాక్టర్‌ ఆగ్రహం
తోగ్గూడెంలో జరుగుతున్న మైనింగ్‌ మాఫియా అంతా ఇంతా కాదని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించకుండా ఎటువంటి అనుమతులు లేకుండా వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ దోచుకుతింటున్నారన్నారు. తనకు కాంట్రాక్టు విషయంలో అవసరమైన కంకరను తరలించేందుకు డబ్బులు తీసుకోని తోగ్గూడెం క్రషర్‌ యజమానులు ఇబ్బందులకు గురిచేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రషర్ల వద్ద లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. అనధికారికంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ కోట్ల రూపాయలు దోచుకుతింటున్న మైనింగ్‌ మాఫియాను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

తోగ్గూడెం నుండి గతంలో బ్లాస్టింగ్‌ సామాగ్రి తరలింపు
తోగ్గూడెం నుండి భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రి నక్సల్స్‌కు తరలించిన విషయం కూడా జరిగిందని ఆవిషయంలో అప్పటి పోలీస్‌ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం కూడా ప్రజలకు తెలుసన్నారు. తోగ్గూడెం మైనింగ్‌ మాఫియా వెనుక సంబంధిత ప్రభుత్వ అధికారులతోపాటు అధికారపార్టీ ,అన్ని రాజకీయ పార్టీల నాయకుల అండదండలు ఉన్నాయన్నారు. ఎవరి ముడుపులు వారికి అందిస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారన్నారు. తోగ్గూడెంలో మైనింగ్‌ అనుమతి లేని ఎన్నో క్వారీల నుండి విచ్చలవిడిగా కంకర తరలుతుంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన క్వారీ యాజమాన్యాలు, దొడ్డి దారిన బ్లాస్టింగ్‌ ప్రక్రియ చేపడుతున్నారు. సమయపాలన లేకుండా క్వారీల యజమానులు బూస్టర్‌ సహయంతో బాంబులు పేల్చి కంకర వెలికి తీస్తున్నారు. మైనింగ్‌ అనుమతి లేక కొద్ది కాలం వ్యాపారాన్ని నిలిపివేసిన మైనింగ్‌ సిండికేట్‌ వ్యవస్థ ఇటీవల కాలంలో చాటుమాటుగా పాతపద్ధతిని అనుసరిస్తోంది. ధన దాహంతో నడుస్తున్న ఈక్వారీల నిర్వహణ వెనుక కొంతమంది రాజకీయ, అధికారుల హస్తముందని ఆరోపణలు ఉన్నాయి.

మైనింగ్‌ అనుమతి లేకుండానే బహిరంగ వ్యాపారం
తోగ్గూడెం క్వారీప్రాంతం నుండి ప్రతి రోజూ వేల టన్నుల కంకర వ్యాపారం నడుస్తుంది. అనధికారికంగా నడిచే ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి భారీ ఎత్తున ఆదాయానికి గండి పడుతుంది. నిరంతరాయంగా తోగ్గూడెం నుండి కంకర వ్యాపారం సాగుతున్నా మైనింగ్‌, విజిలెన్స్‌ వర్గాలు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యాయి.ఛత్తీస్‌ఘడ్‌, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ అమర్‌ తన అవసరాలకు తోగ్గూడెం క్వారీ యాజమాన్యాన్ని సంప్రదించాడు. క్వారీ నిర్వాహకుల్లో ఒకరు ససేమిరా అంటూనే తనకళ్ల ముందు పదుల సంఖ్యలో లారీల కొద్ది కంకర తరలించడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. కెఆర్‌ క్రషర్‌ను పర్యవేక్షించే ఓ వ్యక్తి అభ్యంతరం తెలపడంతో చేసేదేం లేక తోగ్గూడెం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కెఆర్‌కె యజమాని నాని వచ్చేంత వరకు ఆందోళన విరమించబోనని గంటలపాటు భీష్మించుకు కూర్చున్నారు. కొందరు క్వారీ యజమానులు సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. అనారోగ్యం కారణంగా కొన్ని గంటల నిరసన వ్యక్తంచేసి అనంతరం ఆందోళన విరమించారు.

మైనింగ్‌, విజిలెన్స్‌ నిర్వాకంపై ఆగ్రహం
తోగ్గూడెం క్వారీ యాజమాన్యాలు ఏళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్ల రూపాయల రాయల్టీ, సీనరేజ్‌, జిఎస్టీ చెల్లించాల్సి ఉంది. చెల్లింపులు జరక్కపోవడంతో మైనింగ్‌ యంత్రాంగం క్వారీలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొద్దికాలం ఆపేసిన క్వారీలను కొద్దిరోజులుగా వ్యాపారాలను యాజమాన్యాలు తీవ్రతరం చేశాయి. ప్రతినిత్యం వందల లారీలు తోగ్గూడెం క్రషర్ల నుండి తరలుతున్నా మైనింగ్‌,విజిలెన్స్‌ అధికారులుచోధ్యం చూస్తున్నారన్నారు.

నెలవారి ముడుపులకే పరిమితమైన అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి గండి పడినా తమకు సంబంధం లేదనే రీతిలో మైనింగ్‌ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది. తమకు నెలవారి ముడుపులు అందితే చాలు ఏది ఎక్కడకు పోయినా పర్వాలేదనే నిర్లక్ష్యపు ధోరణి, మైనింగ్‌ అధికారుల అనుమతితోనే కంకర ట్రాన్స్‌పోర్ట్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మైనింగ్‌ వ్యాపారాన్ని అరికట్టి విలువైన ప్రజాసంపదను కాపాడాలని ఆయన కోరారు.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS