Thursday, July 17, 2025
spot_img

దసరా నాటికి ఉప్పల్‌ ఫ్లై ఓవర్‌ పూర్తి

Must Read

పనుల తీరును పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వచ్చే దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ప్రభుత్వం విఫ్‌ బీర్ల ఐలయ్య, ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్‌ జాతీయ రహదారిపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు.

తమ ప్రభుత్వం రాగానే ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్‌ గట్కారీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామని కోమటిరెడ్డి వివరించారు. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి పరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరంలో పివి ఎక్సెస్ర్‌ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్‌ గా పేరున్నదని స్పష్టం చేశారు. వచ్చే దసరా నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలియజేశారు. నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతల రోడ్డుపై అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని కారణాల వల్ల కారిడార్‌ పనులు పూర్తి కాలేదని, ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. తొలుత నిర్మాణ పనులు చేపట్టిన గాయత్రీ సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి దసరా నాటికి అందుబాటు-లోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.

Latest News

అమెరికాలో లయన్ గంపా నాగేశ్వర్‌రావుకు అంతర్జాతీయ పురస్కారం

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్, లయన్ గంపా నాగేశ్వర్‌రావు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS