Saturday, August 2, 2025
spot_img

ట్రంప్‌ చెంప చెళ్లుమనిపించిన ఎఐ

Must Read
  • డెడ్‌ ఎకానమీ అంటూ చేసిన ప్రకటపై ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ దిమ్మతిరిగే సమాధనం
  • భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని జవాబు

ప్రస్తుత సాంకేతిక యుగంలో ఓపెన్‌ ఏఐ, చాట్‌జీపీటీ వంటి వాటికి ప్రత్యేక ఆదరణ ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా ఈ కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫామ్‌లు సమాధానం చెబుతున్నాయి. తాజాగా ట్రంప్‌ భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఇవి నిర్మొహమాటంగా ట్రంప్‌ చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ప్రశ్నను పలు ఏఐ ప్లాట్‌ఫామ్‌లను అడగ్గా.. అవి చెప్పిన సమాధానాలు ట్రంప్‌ మూర్ఖత్వాన్ని తెలియచేశాయి. భారత్‌ది డెడ్‌ ఎకానమీయా? అని ఐదు ప్రధాన అమెరికన్‌ ఏఐ ప్లాట్‌ఫామ్‌లను ప్రశ్నించగా.. వాటి సమాధానాలు ట్రంప్‌ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయి. భారత ఆర్థికవ్యవస్థ పతనం కాలేదు. అది డైనమిక్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది’ అని చాట్‌జీపీటీ పేర్కొంది.

భారత్‌ది డెడ్‌ ఎకానమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని గ్రోక్‌ వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతుంది’ – జెమిని తెలిపింది. ఇక, మెటా ఏఐ, కోపైలట్‌ లు కూడా ఇలాంటి సమాధానాలే ఇచ్చాయి. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందనే కారణంతో భారత్‌పై 25శాతం సుంకం, పెనాల్టీలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా, భారత్‌.. వాటి డెడ్‌ ఎకానమీలను మరింత దిగజార్చుకునే అవకాశముందన్నారు. వారు ఎలాంటి వాణిజ్య సంబంధాలు కుదుర్చుకున్నా పట్టించుకోనన్నారు. ఈ వ్యాఖ్యలను భారత్‌ తోసిపుచ్చింది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. మరోవైపు, ట్రంప్‌ మాటలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సమర్థించారు. ట్రంప్‌ చెప్పింది వాస్తవమేనని, ఆ విషయాన్ని ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాన్ని భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. అయితే, రాహుల్‌ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు సైతం తప్పుబట్టడం గమనార్హం. ఈ క్రమంలో ఎఐ సమాధానాలు ట్రంప్‌కు, రాహుల్‌కు చెంపపెట్టులాంటివే.

Latest News

పుచ్చపండు.. పోషకాలు మెండు

పుచ్చకాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? దానికి కూడా దినోత్సవం అవసరమా? ప్రతీ దానికి ఓ రోజు కేటాయించడం కామనైపోయింది. అని మనకు అనిపించడం సహజం. ఐతే.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS