హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) 372 కొలువుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 12 రకాల పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) 50, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ కంట్రోల్) 19, ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 35, చార్టర్డ్ అకౌంటెంట్స్ 24, ఆఫీసర్ (హెచ్ఆర్) 6, ఇంజనీర్ (మెకానికల్) 98, ఇంజనీర్ (కెమికల్) 26, ఆఫీసర్ (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) 1, ఇంజనీర్ (సివిల్) 16, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) 15, వివిధ విభాగాల్లో అనుభవం కలిగిన ఆఫీసర్ లేదా మేనేజీరియల్ పోస్టులు 72 ఉన్నాయి.
ఫ్రెషర్స్ 2025 జూన్ 30 లోపు, అనుభవం కలిగినవారు 2025 జులై 15 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రి అసెస్మెంట్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మూట్ కోర్ట్(లా ఆఫీసర్లకు), ఫిజికల్ ఫిట్నెస్ తదితర పరీక్షల అనంతరం ఎంపిక చేస్తారు. వివరాలకు www.hindustanpetroleum.comను సందర్శించొచ్చు.