- పొన్నంనో.. మహేశ్ గౌడ్‌నో సిఎం చేస్తారా
- సిఎం రేవంత్ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు
రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్ర మోడీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసిపోయినట్లు గుర్తు చేశారు. ఇక, రాహుల్ గాంధీ తల్లి తండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు, ఆయన కులం ఏంటని ప్రశ్నించారు. నిజాలు తెలుసుకుని సిఎం మాట్లాడాలన్నారు. బిసి రిజర్వేషన్లపై తప్పు పట్టించరాదన్నారు. దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమన్నట్టే, మేము కూడా పొన్నం ప్రభాకర్‌ను లేదా మహేష్ గౌడ్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. బీజేపీ బీసీ పక్షపాతి.. బీసీలను పార్టీకి దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు.. మేము 42 శాతం రిజర్వేషన్‌కు సపోర్టు ఇస్తున్నాం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కేంద్రంపై నెట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు.
బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరని, పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తెలియజేశారని రామచందర్ రావు చెప్పారు. గవర్నర్ దత్తాత్రేయ మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉండడం సంతోషం అని రామచందర్ రావు తెలిపారు. నరేంద్ర మోడీ బిసి కాదని రేవంత్ రెడ్డి అవమానించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్వర్టడ్ అని రేవంత్ రెడ్డి కొత్త పదం సృష్టించారని రామచందర్ రావు ఎద్దేవ చేశారు.అయితే, పార్టీలో పోస్టుల కోసం ఒత్తిడి చేయొద్దు అన్నారు. మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చినవారు ఎక్కువ కాదు, రానివారు తక్కువ కాదని వెల్లడిరచారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీ-ని ప్రకటిస్తుంది.. అందులో మొత్తం 20 మందిని నియమిస్తాం.. 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్ రావు చెప్పుకొచ్చారు. ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన సూచనల మేరకు పార్టీ నేతలు ఎక్కువ టూర్లు చేయాలని, కార్యకర్తల్ని కలవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ అంతర్గత సమస్యలు కుటుంబ సమస్యల వంటివే, వాటిని బయటకు తీసుకురావద్దు అన్నారు.