Friday, June 13, 2025
spot_img

తప్పతాగి తప్పించుకోలేరు!!

Must Read

మందు బాబులపై పోలీసుల నజర్‌…!!
పగలూ…రాత్రీ డ్రంకెన్‌ డ్రేవ్‌…!!
మందుబాబులు ఉహించని ప్రాంతాల్లో తనిఖీలు…!!
ఫోటో రైటప్‌…డ్రంకెన్‌ డ్రెవ్‌లో పాల్గోన్న పోలీసులు…!!

హైదరాబాద్‌ భాగ్యనగర రహాదారులపై మోతాదుకు మించి మద్యం తాగి ఇష్టారాజ్యంగా రహాదారులపై వస్తున్న వారిపై నగర ట్రాఫీక్‌ పోలీసులు బ్రీత్‌ఎనలైజర్స్‌తో (శ్వాస పరీక్ష) దృష్టి కేంద్రీకిరంచారు.పగలు..రాత్రీ అని తేడా లేకుండా నగరంలోని పలు ఏరియల్లో డ్రంకెన్‌ డ్రెవ్‌ పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కూడళ్లతో పాటు నగర శివారు ప్రాంతాల అంతర్గత రహాదారులు, కాలనీ అనుసందాన దారుల్లో వెళ్తున్న వారినీ తనిఖీలు చేస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తాగిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. రోజుకు నగటున 60మంది మందు బాబులపై కేసులు నమోదు చేస్తుండడం గమనార్హం.ట్రాఫీక్‌ పోలీసులకు దొరక్కుండా వేర్వేరు మార్గాల్లో జారుకునేవారిని గుర్తించేందుకు డ్రంకన్‌డ్రేవ్‌ ప్రాంతాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.

ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రాఫీక్‌ పోలీసులు మందుబాబులపై దృష్టి సారించడంతో కేవలం 5నెలల వ్యవధిలోనే 23939 మందిపై కేసులు నమోదు చేశారు. పదే.పదే తప్పతాగి పోలీసులకు దొరికిపోయిన 143మంది వాహాన చోదకుల అనుమతి పత్రాలు(డ్రైవింగ్‌ లైసెన్స్‌) తాత్కలికంగా రద్దుయ్యాయి.నగర రహాదారులపై ప్రమాదాలు తగ్గేంత వరకూ ఇదే పంథాను కొనసాగించున్నామని పోలీసు ఉన్నాతాధికారులు పేర్కోంటున్నారు.మందు బాబులపై ట్రాఫీక్‌ పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం….!!
నటిస్తున్నా….పట్టేస్తే మన్నా….??
ఇటివల మందుబాబులు ట్రాఫీక్‌ పోలీసులకు దొరక్కుండా కొత్త పంథాలో ముందుకు సాగుతున్నారు. నగర రోడ్లపై డ్రంకేన్‌డ్రెవ్‌ పరిక్షలు నిర్వహిస్తున్న ట్రాఫీక్‌ పోలీసులను చూడగానే వాహానం దిగి ఉన్నంటుండి గుండే పట్టుకుని కూలిపోవడం… మూర్చవ్యాధి వచ్చినట్టు నటించడం…శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉందంటూ రోడ్డుపక్కనే వెళ్లి కూర్చోవడం, వాహానం దిగకుండానే మేం. ఫలాన రాజకీయ నాయకుడి అనుచరులమని, ఏమ్మేల్లే ఏంపీ, ఐపీఎస్‌, ఏఎఎస్‌, సినీ తారాల వారసులమంటు చేబుతున్నారు.మందుబాబుల ఆహార్యం..వారి ముఖ కవిళికలను గమనించి ట్రాఫీక్‌ పోలీసులు నిజంగా అస్వస్థపాలైతే ఆసుపత్రులకు తీసుకేళ్తున్నారు.వైద్యులు పరీక్షీంచాక అబద్దమని తేలితే జరిమానాతో పాటు పాయింట్లనూ మందుబాబుల ఖాతాల్లోకి వేస్తున్నారు. శ్వాస పరీక్షలకు తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు చూపుతారన్న అంశాలపై క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నా పోలీసు అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.రోగం.జబ్బు పేరుతో నాటకాలాడిన వారి వైనాన్ని వీడియో చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచుతున్నారు.
పక్కాగా శ్వాస పరీక్షలు…!!

drunk and drive testing in hyderabad
drunk and drive testing in hyderabad


మోతాదుకు మించి మద్యం సేవించిన అనంతరం కొందరు మందుబాబులు బైకులు.కార్లను నడుపుకొంటూ వేగంగా గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. డ్రంకెన్‌డ్రేవ్‌ నిర్వహిస్తున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి వేరే మార్గాల్లో వెళ్తూన్నారు. కాని నగర ట్రాఫీక్‌ పోలీసులు మాత్రం వీరిని ఎలాగైన పట్టుకోవాలన్న లక్ష్యంతో మందుబాబులు తప్పించుకుని వెళ్లే మార్గల్లో డంకన్‌ డ్రెవ్‌ నిర్వహిస్తున్నారు. చట్టం ప్రకారం మద్యం తాగిన వారి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 34 మిల్లీగ్రాముల ఆల్కాహాల్‌, వరకే అనుమతి అంతకుమించితే మద్యం తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నారు.బ్రీత్‌ ఎనలైజర్‌ సాంకేతిక లోపాలని ఆరోపిస్తే ఒకటికి రెండుసార్లు వారితో బ్రీత్‌ ఎనలైజర్‌ వద్ద గాలి ఉదమంటున్నారు. సరిగ్గా ఇక్కడే మందుబాబులు చాకచాక్యన్నా ప్రదర్శిస్తున్నారు.బ్రీత్‌ ఎనలైజర్‌ దగ్గరకు రాగానే చిన్నగా ఉదుతున్నారు. మరికొందరు లోపలికి గాలి పీల్చుకుంటున్నారు. శ్వాస వేగంగా బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకొందరు ఎవరో ఉదీన బ్రీత్‌ ఎనలైజర్‌ మళ్లీ మాకు ఉపయోగిస్తున్నారా…?? అంటూ ప్రశ్నస్తున్నారు.ఇలా పోలీసులను ఆత్మరక్షణలోకి పంపించి వెళ్లిపోవాలన్నది వారి ప్రణాళిక ట్రాఫీక్‌ పోలీసులు మాత్రం గట్టిగా గాలి ఉదేంత వరకూ శ్వాస పరీక్షకును నిర్వహిస్తున్నారు. రక్తంలో ఆల్కహాల్‌ శాతం దాటిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు.
బడా బాబుల పిల్లల తీరే వేరే….??
నగరంలోని బంజారహిల్స్‌ జూబ్లి హిల్స్‌ పంజాగుట్టా ఎరియల్లో నివసించే బడాబాబుల పిల్లల తీరే వేరు. బర్త్‌డే పార్టీలని చేసుకుని ఎంచక్క స్నేహితులతో కలిసి మత్తు పదార్ధాలు సేవించి వాహానాలు నడిపి పాదచారుల ప్రాణాలను హారిస్తున్నారు.అంతే వేగంతో వారు వాహానంతో ఉడాయిస్తున్నారు.మరికొందరు బండి ఎక్సిడెండ్‌ అయిన వేంటనే కారు వదిలి పారిపోతున్నారు.ఇలా వారు తమకు తోచిన విధంగా అనుసరిస్తున్నారు.వారి డ్రైవింగ్‌ వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి,దీంతో సామాన్య ప్రజలు పాదాచారులు ఆ దారిలో నడకకు వేళ్లలంటేనే జంకుతున్నారు.మందు మేడంలు మేము కూడ తక్కువనా అన్నట్లు వ్యవహారిస్తున్నారు.విధి నిర్వహాణలో ఉన్న ట్రాఫీక్‌ పోలీసులకు చుక్కలు .చూపిస్తు నానా హాంగామా సృష్టిస్తున్నారు.దీంతో వారిని అదుపు చేసే సమయంలో ట్రాఫీక్‌ పోలీసులు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు.మరి కొంత మంది మందుబాబులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అని రాన మాటలతో దూషిస్తున్నారు.దీంతో చేసేది లేక వారు స్థానిక లాఆండ్‌ ఆర్డర్‌ పోలీసుల సహాయం తీసుకుని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.ఇలా చేప్పుకుంటు పోతే మందుబాబుల తీరే వేరు..
నగరంలో కేసుల నమోదు తీరు….!!
హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 11తెదివరకు కేసుల నమోదు తీరు ఇలా ఉంది.
మొత్తం కేసులు 23939 నమోదు చేశారు.
పట్టుబడ్డా మందుబాబులు సంఖ్య. 23939.
డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంస్పెండ్‌ చేసినవి.143 వరకు ఉన్నవి.శాస్వత డ్రెవింగ్‌ లైసెన్స్‌ ఒకరిది రద్దుచేశారు.
జైలు శిక్షపడ్డావారి సంఖ్య .1077 వరకు ఉన్నవి…
జరిమానా రుసుములు.రూ. 4,48,98,900,వసులు చేశారు.
మత్తులో చిత్తవ కూడదని….నగర ట్రాఫీక్‌ అదనపు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌….!!
మద్యం మత్తులో వాహానాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకే డ్రంకేన్‌ డ్రేవ్‌పై దృష్టి కేంద్రీకరించాం.వారాంతల్లో వందల సంఖ్యలో యువకులు మద్యంమత్తులో వాహానాలు నడుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.న్యూ సిటి తోపాటు పాతబస్తీ పై కూడా దృష్టి కేంద్రీకరించాం.వివిధ ఎరియల్లో విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, పట్టుబడిన వారి వాహానాలు స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులు ,తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్‌కు వచ్చాకే వదిలేస్తున్నాం.మైనర్‌ డ్రైవింగ్‌పై కేసులు నమోదుచేస్తున్నారు.డంకేన్‌డ్రేవ్‌ కేసులో పట్టుబడితే జైలు కెళితే భవిష్యత్తులో వారికి వివిధ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పోందే సమయంలో ఇబ్బందులు తప్పవు.ఈ కేసుల ప్రభావం చూపిస్తున్నాయి.

Latest News

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS