Saturday, April 19, 2025
spot_img

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని పనులు

Must Read
  • ఈ నెలాఖరులోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి
  • పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్‌ ఫౌండేషన్‌ వద్ద నీటి పంపింగ్‌ వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజధాని పనులకు సంబంధించి ఇప్పటివరకు 40 టెండర్లు పిలిచామని అన్నారు. జనవరి నెలలోగా టెండర్ల పక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి రెండవ వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. న్యాయపరమైన అంశాల కారణంగా పనుల ప్రారంభం ఆలస్యమైందన్నారు. 2015 జనవరి ఒకటో తేదీన ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌ ఇస్తే కేవలం 58 రోజుల్లోనే రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. రాజధాని అమరావతిని ప్రపంచంలో టాప్‌ 5 లో ఒకటి గా చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఐకానిక్‌ భవనాలు డిజైన్లను నార్మన్‌ ఫాస్టర్‌ చేత చేయించామన్నారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జీలు కోసం 2019కు ముందే మొత్తం 4,053 అపాªటంªమెంట్లు పనులు ప్రారంభించామని చెప్పారు. తమపై కక్షతో గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపేసిందన్నారు. అసెంబ్లీ ని 250 విూటర్ల ఎత్తులో నిర్మించి సమావేశాల నిర్వహణతోపాటు మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్‌ గా చేయాలని డిజైన్‌ చేశామన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు అందరూ ఒకేచోట ఉండేలా 5 అడ్మినిస్టేట్రివ్‌ టవర్‌ లు డిజైన్‌ చేశామని చెప్పారు. కోటి 3 వేల చదరపు అడుగులతో భవనాలు డిజైన్‌ చేసి పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం నిర్మాణాలన్నింటినీ నీళ్ళలో పెట్టేసిందని ఆరోపించారు. నీళ్లలో ఉండటంతో నాణ్యత కోసం ఐఐటి నిపుణులతో అధ్యయనం చేయించామని మంత్రి చెప్పారు. విద్యుత్‌ లైన్‌ లు, డ్రైనేజీలు, తాగు నీటి పైపులు అన్నీ అండర్‌ గ్రౌండ్‌ లో ఉండేలా డిజైన్‌ చేశామన్నారు. గత ప్రభుత్వం మొత్తాన్ని అడవిగా మార్చేసిందని విమర్శించారు. న్యాయపరమైన కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యం అయిందని, ఇప్పటి వరకూ మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచామని అన్నారు. జనవరి నెలాఖరు లోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సి ఆర్‌ డి ఎ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS