Thursday, March 13, 2025
spot_img

లక్షల రూపాయల ప్రజాధనం వృధా

Must Read
  • నర్సరీల్లో మొక్కలను గాలికొదిలేసిన కార్యదర్శులు
  • నిర్వహణ లేక ఎండిపోయిన వేల మొక్కలు
  • ఇందిరమ్మ రాజ్యంలో నీరుగారుతున్న వనమహోత్సవ లక్ష్యం
  • జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ది పథకాలను గ్రామస్థాయిలో అమలు చేయాల్సిన పంచాయితి కార్యదర్శులు బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు హాజర వుతూ నిర్వహించాల్సిన పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజాధనం వృథా కావడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యాలు సైతం నీరుగారుతున్నాయి.పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో పైనంపల్లి, ఏనేకుంటతండా గ్రామాల కార్యదర్శులు విధులకు యధేచ్ఛగా డుమ్మా కొడుతున్నారు. సమయపాలన పాటించ కుండా చుట్టం చూపుగా విధులకు హాజరు అవుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాల్సిన మండల పంచాయితి అధికారి పట్టించుకోకపోవడంతో ఆడిరదే ఆటగా, పాడిందే పాటగా కార్యదర్శిలు విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రజాధనం వృధా అవ్వడానికి బాధ్యులెవరు..!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకి స్వచ్చమైన ప్రాణ వాయువుని అందించేందుకు సిఎం రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన వనమ హోత్సవం పథకం ఉద్దేశ్యం అభాసుపాలు అవుతుంది. కార్యదర్శులకు కమీషన్లు వచ్చే పనుల మీద ఉన్న శ్రద్ధ ప్రజలకి పనికి వచ్చే పథకం పై లేకపోవడంతో వనమహోత్సవం కోసం లక్షల రూపాయలను వెచ్చించి ప్రభుత్వ నర్సరీల్లో పెంచుతున్న వేల మొక్కలు నాటకుండానే చనిపోతున్నాయి.వీటిలో అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కలు కూడా ఉండటం గమనార్హం. నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం నిత్యం పంచాయితి ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా చేసి సంరక్షించక పోవడంతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోయాయి. ఏనేకుంటతండా నర్సరీ బ్యాగుల్లో మొత్తం గడ్డితో నిండిపోయింది. ఏపుగా పెరిగిన కొన్ని మొక్కలను కాల్చివేసిన దాఖలాలు కూడా నర్సరీలో కనిపిస్తున్నాయి.

నర్సరీలలో మొక్కలు పెంచడానికి మొదటగా సరిపోయే విస్తీర్ణంలో భూమి చదును చేసి, మట్టిని సరఫరా చేసి,కొన్ని బ్యాగుల్లో మట్టిని నింపి విత్తనాలు నాటడం, కొన్ని మొక్కలు కొనుగోలు చేయడం, విత్తనాలు మొలకెత్తిన దగ్గర నుండి మొక్కను నాటేంతవరకు సంరక్షించాలి. అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసిన సమయం నుండి వన సేవకులను నియమించే వరకు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసే లక్షల రూపాయలు కార్యదర్శుల ఉదాసీన వైఖరి కారణంగా వృధా అవుతున్నాయి.

కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలి : కొప్పుల ఉపేందర్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ మండల నాయకులు
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటూ ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ నర్సరీల్లో వేల మొక్కలు ఎండిపోవడానికి కారణమైన పంచాయితి కార్యదర్శిలను వెంటనే విధుల నుండి తొలగిం చాలని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు కొప్పుల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని కోరారు.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS