- ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి
- పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం
రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య గజ్వేల్ ఎలక్ట్రిసిటీ ఏఈ మారుతి హాజరైనారు. ఈ సందర్భంగా గజ్వేల్ సీఐ సైదా సమావేశంలో మాట్లాడుతూ.రంజాన్ మాసంలో ఎక్కువమంది ఉపవాసం ఉండడం జరుగుతుందని అలాగే ఇంద్ర పార్క్ చౌరస్తా సంగాపూర్ రోడ్డు వద్ద ఫుడ్స్ అమ్మడం జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలని అలాగే రాత్రివేళ పిల్లలు వెహికల్ రాష్ డ్రైవింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు . మున్సిపాలిటీ మరియు ఎలక్ట్రిసిటీ గురించి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వారు సూచించారు .దానిలో భాగంగానే వారికి కూడా చెప్పడం జరిగినది ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రోడ్లపై హరీస్ పెట్టకుండా చూసుకోవాలని సూచనలు చేశారు. అలాగే మున్సిపాలిటీ వారికి సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి పెట్టగలరని మున్సిపల్ కమిషనర్ తేలియడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ముస్లిం సోదరులు హిందూ సోదరులు తదితరులు పాల్గొన్నారు.