మరో మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.మీరట్-లక్నో,మదురై-బెంగళూరు,చెన్నై -నాగర్ కోయిల్ 03 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ” ఆత్మనిర్భర్ భారత్ ” కింద వీడియొ కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,భారతీయ రైల్వే ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికీ సుఖవంతమైన ప్రయాణం అందించే వరకు తాము ఆగబోమని స్పస్టం చేశారు.ఎన్నో ఏళ్లుగా దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే శాఖ కీలక అడుగులు వేసిందని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ ప్రారంభించిన 03 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తమిళనాడు,కర్ణాటక,ఉత్తరప్రదేశ్ ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుంది.