Thursday, November 21, 2024
spot_img

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు

Must Read
  • 2024-25 వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • వ్యవసాయ రంగానికి రూ.1.5 లక్షల కోట్లు
  • విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
  • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు

మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.2024-25 వార్షిక బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రాధ్యానం కల్పిస్తూ రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.ఉత్పాదకత,వాతావరణాన్ని తట్టుకునే 9 రకాల వంగడాలను పెంచడంపై దృష్టి సారించేలా వ్యవసాయ పరిశోధన రూపాంతరం చెందుతుందని వెల్లడించారు.వాతావరణాన్ని తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధన సెటప్‌ను సమగ్రంగా సమీక్షించాలని తెలిపారు.ఈ నిధితో వ్యవసాయం,సంబంధిత రంగాలకు పథకాలు రూపొందించనున్నారు.ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యతలలో ఒకటి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి. దీని కింద మొదటిసారి ఉద్యోగార్ధులకు భారీ సహాయం అందనుంది.మొదటిసారిగా ఫార్మల్ రంగంలో ఉద్యోగం ప్రారంభించే వారికి ఒక నెల జీతం ఇవ్వ బడుతుంది. ఈ వేతనాన్ని డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ ద్వారా మూడు విడతలుగా విడుదల చేస్తారు. దీని గరిష్ట మొత్తం రూ.15 వేలు.ఈ.పి.ఎఫ్ లో నమోదు చేసుకున్న వ్యక్తులు ఈ సహాయం పొందుతారు.అర్హత పరిమితి నెలకు రూ. 1 లక్ష ఉంటుంది.దీనివల్ల 2.10 కోట్ల మంది యువతకు ప్రయోజనం కలుగుతుంది. బడ్జెట్‌కు సంబంధించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిని సాధారణ బడ్జెట్ అమృతకాల్ ముఖ్యమైన బడ్జెట్ అని అన్నారు. ఇది ఐదేళ్ల పాటు మన దిశను నిర్దేశిస్తుందని, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశానికి పునాది వేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.మరోవైపు కేంద్రబడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ప్రాధ్యానం కల్పిస్తూ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించారు.విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ. లక్షా 48 వేల కోట్లు కేటాయించగా వ్యవసాయం,అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లను కేటాయించారు.మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో మరోసారి కేంద్రం పెద్దపీట వేసింది.రూ. 11.11 లక్షల కోట్లను కేటాయించింది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS