- మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత
- సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!!
- వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..!
- ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం!
- ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం!
- న్యాయపోరాటం విషయంలో అంతంతే!
- కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..!
తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి రాజుల కాలాన్ని తలపించేలా కేసీఆర్ కుటుంబ అధికార దర్పం! వాళ్ళు ఏది తలుచుకుంటే అది జరిగి తీరాల్సిందే అన్నట్లుగా నియంతృత్వ అజమాయిషీ! ఇపుడు అదంతా ఒక చరిత్ర! అధికారం పోయాక అన్నీ కష్టాలే మిగిలాయి! రాజుల వెలుగు వెలిగిన కేసీఆర్ ఎప్పుడూ లేనంత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు! అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనే కన్నబిడ్డ కవిత అరెస్ట్ తో మొదలైన సమస్యల పరంపర ఇపుడు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి! వరుస షాకులతో కేసీఆర్ గుక్క తిప్పుకోనంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కుమార్తె అరెస్ట్…అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికలలో చేదు అనుభవం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం కుంగుబాటు..అవినీతి ఆరోపణలు… ఇలా వరుసగా ఒకదాని వెనుక మరొకటి అన్నట్లుగా నిత్యం ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోనలతో కేసీఆర్ వణికిపోతున్నట్లు కనబడుతోంది! ఒక నాడు రాష్ట్రంలో విపక్ష రాజకీయ పక్షాల అస్థిత్వాన్నే ప్రశ్నఅర్థకం చేసేలా రాజకీయాలను శాసించిన కేసీఆర్ ఇపుడు సొంత పార్టీని కాపాడుకోవడం ఎలాగో తెలియక తీవ్ర మధన పడుతున్నట్లు తెలుస్తోంది. నమ్ముకున్న వాళ్ళు, అందలం ఎక్కించిన వాళ్ళందరూ కష్ట కాలంలో కేసీఆర్ కు హ్యాండ్ ఇస్తున్నారు! పక్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు! ఆశ్చర్యమేంటంటే రాజకీయాల్లో దశాబ్దాల సీనియారిటీ ఉన్నవాళ్ళు, రాజకీయంగా ప్రాధాన్యత పొంది పదవులు అనుభవించిన వాళ్ళే ఎక్కువగా ఇతర పార్టీల్లోకి జంప్ కావడం కేసీఆర్ ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది!
కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అవినీతిలో కూరుకుపోయినట్లుగా ఇప్పటికే బలమైన ఆధారాలు లభిస్తున్నాయి..! రాష్ట్ర స్థాయిలో అవినీతి కుంభకోణాల్లో మిగతావాళ్ళు ఆరోపణలు ఎదురుకుంటుండగా… డిల్లీ లిక్కర్ స్కాం లో కవిత అరెస్ట్ అయింది..!
జాతీయ స్థాయి రాజకీయాలు అంటూ హడావుడి చేసి అడ్డగోలుగా వందల కోట్లు తగలేసి పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. కూతురు అరెస్ట్ అయితే ఎందుకు ఆ స్థాయిలో ఖర్చుపెట్టి న్యాయ పోరాటం చేయడం లేదు…! ఫాం హౌస్ లో కూర్చుని కంటి తుడుపు ఏడుపులు ఎందుకు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి!
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసీఆర్ బిడ్డ కవిత దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదనేది ఆసక్తిగా మారింది! ఈ ఏడాది మార్చ్ 15 న ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసి తీహార్ జైలు కు తరలించిన విషయం అందరికి తెలిసిందే! ఆమె అరెస్టై ఇప్పటికే వంద రోజులు కావొస్తోంది! కుటుంబ సభ్యులు సహా పార్టీ ముఖ్య నేతలు తీహార్ జైలుకు వెళ్లి కవితను పరామర్శించి వస్తున్నారు! అయితే ఆమె జైలు కు వెళ్లిన నాటి నుండి ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అసలు అయన కవిత జైలు లో ఉంది అన్న విషయాన్నే మరిచిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కవిత ప్రస్తావన వచ్చినా కూడా పెద్దగా మాట్లాడేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదని, చికాకుగా ముఖం పెడుతున్నారని ఆయనతో చనువున్న పార్టీ ముఖ్యలు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. ఎందుకు వెళ్లి కలవట్లేదు అని అడగాలనుకున్న నేతలు కూడా కేసీఆర్ వైఖరిని గమనించి అడగలేకపోతున్నారని తెలుస్తోంది.కవిత అరెస్ట్ వ్యవహారంపై అరెస్ట్ జరిగిన నాటి నుండి పార్లమెంట్ ఎన్నికల నాటి వరకు పెద్దగా ప్రస్తావించని కేసీఆర్…ఎన్నికల ప్రచార సభల్లో మాత్రం ప్రధానంగా ప్రస్తావించాడు. తన బిడ్డ ను మోడీ, అమిత్ షా లు కావాలనే అన్యాయంగా అరెస్ట్ చేశారని, తనమీద ఉన్న కోపంతో కవితను అరెస్ట్ చేసారంటూ సెంటిమెంట్ ను రగిల్చే వ్యాఖ్యలు చేసాడు. అయితే ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఆ అంశాన్ని ప్రచార ఘట్టం చివరి నాటికి మెల్లిగా వదిలేసాడు. నిజానికి ప్రజల నుండి స్పందన లేకపోవడానికి కేసీఆర్ వైఖరే కారణమనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మర్చి నెలలో కవిత అరెస్ట్ అయిన వెంటనే కేసీఆర్ రంగంలోకి దిగి తెలంగాణ లో ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి కవిత అరెస్ట్ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో జరిగిన అరెస్ట్ గా బయటి ప్రపంచానికి బలంగా తెలియచేసే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని చేయలేదు. మౌనంగా రోజుల తరబడి ఉండిపోయాడు. ఆమె అరెస్ట్ తర్వాత నెలరోజులకు తీరిగ్గా ఎంపీ ఎన్నికల సందర్బంగా ప్రజల్లోకి వెళ్లిన కేసీఆర్ ప్రచార సభల్లో అరెస్ట్ అన్యాయం అని గగ్గోలు పెట్టినప్పటికీ ప్రజల్లో స్పందన లేకుండా పోయింది. అప్పటికే ఆ అంశాన్ని కేసీఆర్ స్వయంగా చల్లబరించినట్లయింది. ఇదిలా ఉంటె ఎన్నికలు ముగిశాక కవిత అరెస్ట్ అంశాన్ని కేసీఆర్ అటకెక్కించారు! అయన మాటల్లో ఎక్కడా ఆమె విషయాన్ని మళ్ళీ ప్రస్తావించలేదు! దింతో కవిత అరెస్ట్ ను కేవలం ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే కేసీఆర్ చూసాడా? అనే అనుమానాలు ప్రజల నుండి రాజకీయ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి.
సొంత బిడ్డ ను అరెస్ట్ చేసి ఎక్కడో తీహార్ జైలు లో పెడితే… వంద రోజులైనా ఆ వైపుకు చూడని కేసీఆర్ హైదరాబాద్ లో కూర్చుని కంటి తుడుపుగా మాట్లాడుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అరెస్ట్ చేస్తే.. తన తండ్రిది రాజకీయ కుట్రతో కూడుకున్న అరెస్ట్ అంటూ అయన తనయుడు లోకేష్ ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాలో ఫోకస్ అయ్యేలా బలంగా తీసుకువెళ్లాడు. అంతే కాదు! చంద్రబాబు, ఎన్ఠీఆర్ కుటుంబసభ్యులు టీడీపీ యంత్రంగం మొత్తం చంద్రబాబు కు బెయిల్ వచ్చి జైలు నుండి విడుదలయ్యే వరకు అలుపెరగని పోరాటం చేశారు. కానీ కేసీఆర్ మాత్రం కూతురు అరెస్ట్ వ్యవహారాన్ని న్యాయవాదులకు అప్పచెప్పి పట్టించుకోవడం మానేశారు. నిజంగా కేసీఆర్ బలమైన న్యాయపోరాటం చేసి ఉంటే కవిత అరెస్ట్ కేవలం రాజకీయ కోణంలో చేసిందే అనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్ళేది. అసలు పోరాటమే లేదు కాబట్టి కవిత నిజంగానే తప్పు చేసింది అనే అభిప్రాయం విస్తరిస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది అసలు స్కామ్ కానీ కాదని, పాలసీ ని స్కామ్ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపుకు పాల్పడుతుందని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కవిత అరెస్ట్ సమయంలో బలంగా వాదించారు. అయితే న్యాయ పోరాటం విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో సీరియస్ నెస్ కనబరచలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు అధినేత…బిడ్డ అరెస్ట్ ను గట్టిగా పట్టించుకోవాల్సిన కేసీఆర్ మౌన మునిగా ఉండిపోవడంతో కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతలు కూడా అరెస్ట్ అంశంపై పోరాటం విషయంలో ప్రాధాన్యత తగ్గించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కవిత తీహార్ జైలు కు వెళ్లి వంద రోజులు కావస్తున్నా…బిడ్డ ను చూడటానికి కేసీఆర్ ఇంతవరకు జైలు కు వెళ్లకపోవడంపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి!