Friday, September 20, 2024
spot_img

20 మంది కలెక్టర్ లను బదిలీ చేసిన ప్రభుత్వం

Must Read

తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నాగర్ కర్నూలు కలెక్టర్ గా సంతోష్,కరీంనగర్ కలెక్టర్ గా అనురాగ్ జయంతి,కామారెడ్డి కలెక్టర్ గా ఆశిష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్ గా రాహుల్ శర్మ, నారాయణపేట కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య , ఖమ్మం కలెక్టర్ గా మొజామిల్ ఖాన్,రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,మహబూబ్ నగర్ కలెక్టర్ గా విజయేంద్ర బోయి,జగిత్యాల కలెక్టర్గా సత్య ప్రసాద్, మంచిర్యాల కలెక్టర్ గా కుమార్ దీపక్,నల్గొండ కలెక్టర్ గా నారాయణ రెడ్డి,వికారాబాద్ కలెక్టర్గా ప్రతిక్ జైన్,నిర్మల్ కలెక్టర్ గా అభిలాష అభినవ్,ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర,వరంగల్ కలెక్టర్ గా సత్య శారద దేవి,సూర్యపేట కలెక్టర్ గా తేజస్ నందలాల్ వనపర్తి కలెక్టర్ గా అధర్శ సురభి లను ప్రభుత్వం బదిలీ చేసింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This