పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య,దాసరి కొండప్ప తదితరులకు ప్రతీ నెల25 వేల రూపాయల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు.ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి.