- పార్టీపరంగా గెలిచినవి పదకొండు
- మిత్రపక్షలవి మరో పద్దెనిమిది
- మొత్తంగా గెలిచినవి ఇరవై తొమ్మిది..!
- మంత్రి పదవులు ఐదు..!
- కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సముచిత స్థానమే!
మునుపెన్నడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటుకుంది..
తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి మొత్తం 17 స్థానాల్లో ఎనమిది స్థానాలు గెలుచుకుని యాభై శాతం సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది…
ఏపీలో బలం లేకపోయినా టీడీపీ జనసేన కూటమి తో జతకొట్టి లబ్ధి పొందింది…
ఏపీలో మూడు ఎంపీ స్థానాలు గెలుచుకుని పునాది ని బలపరుచుకుంది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ బీజేపీ సీట్లు సాధించలేదు..!
ఏపీ లో పక్కనబెడితే తెలంగాణ లో ఒంటరిగా బలంగా ఎదుగుతున్నట్లు బీజేపీ మరోసారి నిరూపించుకుంది..
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ కు ప్రాతినిథ్యం ఒకటి నుండి రెండుకు పెరిగింది.
తెలంగాణ లో పార్టీకి అండగా నిలిచిన వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి న్యాయం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..
అందరూ ఊహించినట్లుగానే బండి సంజయ్ కు మంత్రివర్గంలో స్థానం లభించింది..