Thursday, November 21, 2024
spot_img

నిఫ్టీ, సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు

Must Read
  • మొదటిసారిగా 76000 మార్క్‌ సెన్సెక్స్‌

సోమవారం స్టాక్‌ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్‌ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్‌ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్‌ సెషన్‌ లో స్టాక్‌ మార్కెట్‌ సరికొత్త బెంచ్‌ మార్క్‌ ను అందుకుంది. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డుల్ని నమోదు చేశాయి. %ూడూ దీూజు% సెన్సెక్స్‌ మొదటిసారిగా 76000 మార్క్‌ ను దాటింది. నిఫ్టీ 50 కూడా 500 పాయింట్లకు పైగా పెరిగి.. గరిష్ట స్థాయి 23,110.80కి చేరింది. మధ్యాహ్నం 1.26 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 495.85 పాయింట్లు పెరిగి 75,906.24 వద్ద, నిఫ్టీ 126.45 పాయింట్లు పెరిగి 23,083.55 వద్ద ఉన్నాయి. ముంబై దలాల్‌ స్ట్రీట్‌ లోనూ మార్కెట్‌ సూచీలు లాభాలను చూశాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐటీ స్టాక్‌ లు భారీ లాభాలను అందించాయి. నిఫ్టీ 50లో దివీస్‌ లాబొరేటరీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లు లాభాలు పొందిన వాటిలో టాప్‌ 5లో ఉన్నాయి. అలాగే విప్రో, గ్రాసిమ్‌, ఓఎన్‌ జీసీ, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ లూజర్ల జాబితాలో ఉన్నాయి. ఒక్కసారిగా కొత్తరికార్డులతో మదుపరులకు లాభాలతో ఆశలు చూపించిన స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌ గా ముగిశాయి. 600 మేర లాభపడిన సెన్సెక్స్‌.. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో.. వచ్చిన లాభాలన్నింటినీ కోల్పోయింది. దీంతో సెన్సెక్స్‌ ఫ్లాట్‌ గా ముగిసింది. నిఫ్టీ మాత్రం 22,900కి పైనే ముగిసింది. కేంద్రంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న వార్తలు స్టాక్‌ మార్కెట్లను లాభాల బాటపట్టించాయి. జూన్‌ 4 ఫలితాల తర్వాత బీజేపీ దేశంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుందంటూ యూబీఎస్‌ అంచనా వేసింది. ఒకవేళ బీజేపీ 250 కంటే తక్కువ సీట్లు సాధిస్తే.. ఇన్వెస్టర్లు 10-20 శాతం నష్టపోయే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS