మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 921 మంది నామినేషన్లను తిరస్కరించినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 29తో ముగిసింది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.05 కోట్ల మందికి పైగా పురుషులు ఉండగా, 4.6 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 72 లక్షలకు పెరిగిందని ఈసీ వెల్లడించింది.