Friday, November 22, 2024
spot_img

95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను కోరుకుంటున్నారు

Must Read
  • న్యూట్రోజెనా స్కిన్ రివైండ్ సర్వే

స్కిన్ రివైండ్ సర్వే ద్వారా మహిళలలో యాంటీ-ఏజింగ్ పరిష్కారాలపై జ్ఞాన లోపాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్‌లు సిఫారసు చేసిన చర్మ సంరక్షణ బ్రాండ్ న్యూట్రోజెనా హైలైట్ చేసింది.స్కిన్ రివైండ్ సర్వే ద్వారా 95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను క్రమంగా అన్వేషిస్తున్నారు.ప్రతి ఇద్దరిలో ముగ్గురు మహిళలు చర్మ సమస్యల్లో జారీ రేఖలు,ముడతలు వయస్సు సంబంధ సమస్యలుగా చేర్చారు.75% మహిళలు జారీ రేఖలు,ముడతలను వయస్సు ప్రారంభ సూచనలుగా గుర్తించినప్పటికీ,కేవలం 42% మహిళలు మాత్రమే ప్రత్యేక యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను ఉపయోగిస్తున్నారని సర్వే ద్వారా వెల్లడైంది.అదనంగా,85 శాతం మంది మహిళలు చర్మ వయస్సు సమస్యలను తొందరగా పరిష్కరించాలని కోరుకున్నారు.ఏజింగ్ అండ్ ది ఇండియన్ ఫేస్:ఎన్ అనలిటికల్ స్టడీ ఆఫ్ ఏజింగ్ ఇన్ ది ఏసియన్ ఇండియన్ ఫేస్” అనే అధ్యయనం ప్రకారం,భారతీయ చర్మం ఇతర చర్మ రకాల కంటే 10 సంవత్సరాలు వేగంగా వృద్ధాప్య లక్షణాలను ప్రదర్శిస్తుందని పేర్కొంది.వాయు కాలుష్యం,పర్యావరణం,సూర్యరశ్మి ప్రభావం,జీవనశైలి సంబంధిత ఒత్తిడి, తక్కువ నిద్ర మొదలైన అంశాలు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపించి ముడతలు రాకుండా ప్రభావితం చేస్తాయని తెలిపింది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు న్యూట్రోజెనా కొత్త విజిబుల్ రిపేర్ శ్రేణిను విడుదల చేసింది.ఈ ఉత్పత్తి శ్రేణి వేగంగా పనిచేసే రెటినాల్,ఇతర శక్తివంతమైన యాంటీ-ఏజింగ్ పదార్థాలను కలిగి ఉందని తెలిపింది.ఈ సంధర్బంగా మణోజ్ గాడ్గిల్,బిజినెస్ యూనిట్ హెడ్, ఎసెషియల్ స్కిన్ హెల్త్ అండ్ బ్యూటీ వీపీ మార్కెటింగ్,కెన్వ్యూ మాట్లాడుతూ, చర్మ వృద్ధాప్య సమస్యలు భారతీయ మహిళలు ఎదుర్కొనే ప్రముఖ చర్మ సంరక్షణ సమస్యలలో ఒకటని వెల్లడించారు.మహిళలు ఇప్పుడు ఎక్కువగా ఆరోగ్య,చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఈ ఉత్పత్తి శ్రేణి,ప్రత్యేకంగా భారతీయ మహిళల వయస్సు సంబంధ చర్మ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు.మహిళల చర్మ విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు.మహిళలుగా,చర్మం లోపాలు,ముడతల గురించి చింతిస్తారని,వీటిని పరిష్కరించడంలో సమర్థవంతమైన యాంటీ-ఏజింగ్ పరిష్కారాలు అందించడంలో,న్యూట్రోజెనా విజిబుల్ రిపేర్ రేంజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని డాక్టర్ జైశ్రీ,24 సంవత్సరాల అనుభవం ఉన్న బోర్డ్ సర్టిఫైడ్ కాస్మెటిక డెర్మటాలజిస్ట్ అన్నారు.మావెన్‌సెన్సం ద్వారా 800 మంది మహిళలను ఆన్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో ఢిల్లీ,ముంబై,చెన్నై,బెంగళూరు,కోల్‌కతా, అహ్మదాబాద్,పూణే హైదరాబాద్ నుండి గృహిణులు,ఉద్యోగినులు,వ్యాపారవేత్తలు చేర్చబడ్డారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS