జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్, హేమంత్ సోరెన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడి నేత తేజస్వి యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ పవర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
హేమంత్ సోరెన్ ఇప్పటివరకు 03 సార్లు ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. తాజాగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.