తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?
ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!
లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరక
ఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…
పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల కోసం నిరీక్షిస్తున్నారు !
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కోరుతూ బలవన్మరణం పొందిన శ్రీకాంతాచారిని మరచిన నాయకులు పదేళ్ల పాలనలో ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను పక్కన పెట్టిన గత ప్రభుత్వం,
నేటి ప్రభుత్వంలో ఆయిన ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరేనా !
ఉద్యమకారుల పోరాటానికి ఇంకెప్పుడు న్యాయం లభిస్తుందో..?
Must Read