Friday, December 13, 2024
spot_img

దివీస్ పై కమలం కొట్లాట

Must Read
  • ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
  • స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే
  • వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి
  • న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం
  • రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ
  • దివీస్‎కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం
  • ‘ఆదాబ్ హైద్రాబాద్’లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ కాలుష్యంతో ఈ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. దివీస్ కంపెనీ నుంచి విడుదల చేసే వ్యర్థ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నోసార్లు స్థానిక ప్రజలు ఆందోళన బాట పట్టిన ఘటనలు చూశాం. గాలి, నీరు, కాలుష్యంతో రైతులు, గీత కార్మికులు, స్థానికులు నష్టపోతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు కంప్లైంట్స్ చేసిన, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లిన దివీస్ కాలుష్యం బాధ పోవడం లేదు. అటు పీసీబీ అధికారులకు పరిశ్రమ యాజమాన్యం వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎంపీలు సహా పొలిటికల్ పార్టీల నేతలు సైతం దివీస్ ల్యాబ్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని సపోర్ట్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ డివీస్ కంపెనీపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు ఎన్నో ఏళ్లుగా రైతులు, గీతకార్మికులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అని అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ నారాయణపురం మునుగోడు మండలాల ప్రజలు డివీస్ పరిశ్రమలో ఇబ్బందులు గత ఇరవై సంవత్సరాలుగా ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. ఉత్పత్తుల నుండి వెలువడిన వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా భూగర్భంలోకి వదలడంతో పరిసర గ్రామాలలో పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారడంతో భూగర్భ జలాలు కనీసం వినియోగానికి పనికి రాకుండా పోయాయిని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

దివీస్ కాలుష్యంపై 20 ఏళ్ళుగా రైతుల పోరు:

దివీస్ ఫార్మా కంపెనీ నుండి వెదజల్లే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు, గీత కార్మికులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. దివీస్ కాలుష్యంపై చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నారు. దివీస్ ల్యాబ్స్ యాజమాన్యం డబ్బు ఆశకు, ఒత్తిడికి అధికారులు ఇతర ప్రయోజనాలు ఆశించి లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రజలు పక్షాన నిలబడాల్సిన అధికారులు…. దివీస్ ల్యాబ్స్ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రజాప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

పదుల సంఖ్యలో కోర్టుల్లో కేసులు, ఎన్నో ఫిర్యాదులు :

దివీస్ ల్యాబ్స్ విష కాలుష్యంపై తాము సకలం కోల్పోతున్నామని… రైతులు, గీత కార్మికులు, స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, రాజకీయ నాయకులు దగ్గరకు ఇలా తిరగని చోటు లేదని వాపోతున్నారు. కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు, వందల్లో ఫిర్యాదులు చేసిన తూతూ మంత్రంగా ఉందంటున్నారు. ఎన్ని కంప్లైంట్స్ చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టక పోవడంతో తెలంగాణ హైకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీం కోర్టులో రైతులు, గీత కార్మికులు. న్యాయస్థానాలలో కేసులు వేయడం జరిగింది.

ఏడాదిగా “ఆదాబ్ హైదరాబాద్” వరుస కథనాలు:

“ఆదాబ్ హైద్రాబాద్” పత్రికలో గత ఏడాది కాలంగా దివీస్ ల్యాబ్స్ కాలుష్యంతో నిబందనలకు విరుద్ధంగా పర్యావరణ చట్టాలకు పాతర వేస్తు అక్రమ నిర్మాణాలపై పరిశ్రమ ఎదుట రైతుల ధర్మా న్యాయస్థానాలలో దివీస్ ల్యాబ్ పై విచారణకు సంబంధించిన సమాచారాన్ని మునుగోడు నియోజకవర్గ ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ఎన్ని ఒత్తిడిలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ప్రజల పక్షాన నిలబడడం దివీస్ ల్యాబ్స్ ప్రజల సమస్యలను ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి రాజకీయ ప్రతిపక్ష పార్టీల దృష్టికి తీసుకురావడంతో ప్రజల వక్షాన రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమబాట పట్టడానికి రాష్ట్ర పార్టీల నాయకత్వానికి ఆదేశాలతో ఉద్యమ కార్యచరణ ప్రారంభించి ప్రజల పక్షాన పోరాడటానికి కృషి చేసిన ఆదాబ్ యాజమాన్యానికి మునుగోడు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

బిజెపి దివిస్ ల్యాబ్స్ కార్యాచరణ సిద్ధమైనట్లు రాష్ట్ర నాయకత్వం ఆమోదం, తెలిపినట్లు సమాచారం, ఉద్యోగ అవకాశాలు కాలుష్యంపై మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన సమస్య దివిస్ ల్యాబ్స్ పరిశ్రమ స్థాపించి 40 సంవత్సరాలు గడుస్తున్న స్థానికులకు మాత్రం ఉద్యోగాలు కల్పించకుండా స్థానికేతరులకు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తు ఇతర రాష్ట్రాలలో ఇంటర్యూలు జరుపుతూ నేరుగా ఉద్యోగ నియమకాలు. జరుపుతూ తెలంగాణ యువతకు ముఖ్యంగా మునుగోడు. నియోజకవర్గ నిరుద్యోగ యువతకు అవకాశాల కల్పించకుండా తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు.

టీబీజేపీకి చెందిన కేంద్రమంత్రుల మానం పేరుతో “ఆదాబ్ హైద్రాబాద్” పత్రికలో వార్తలు రావడంతో వారిలో చలనం వచ్చినట్టుంది. దీనిపై రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకులకు కార్యాచరణ రూపొందించి దివీస్ ల్యాబ్స్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, ఏళ్ళ తరబడిగా దివీస్ పరిశ్రమ కాలుష్యంతో ఉపాధి కోల్పోయిన 1200 కుటుంబాల గీతకార్మికులకు అండగా, దివీస్ ల్యాబ్స్ కాలుష్యంతో గత 20 సంవత్సరాలుగా పంటలు పండక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించే విధంగా దివీస్ ఫార్మా పరిశ్రమపై కమలదళం కార్యాచరణకు సిద్ధమైనట్లు అందుకు రాష్ట్ర పార్టీ మౌఖికంగా చెప్పినట్లు తెలుస్తోంది.

న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురుచూపు :

ఎన్నో ఏళ్లుగా దివీస్ ఫార్మా కంపెనీతో సతమతం అవుతున్నతమకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎంట్రీతో అయిన తమ భవిష్యత్ మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు, గీత కార్మికులు, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు. దివీస్ ల్యాబ్స్ కాలుష్యంపై దివిస్ ల్యాబ్స్ పరిశ్రమలో స్థానికులకు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిజంగా భారతీయ జనతా పార్టీ దివిస్ ల్యాబ్ పై ప్రజల పక్షాన పోరాటం చేస్తే దివిస్ ల్యాబ్స్ పరిశ్రమలో నష్టపోయిన రైతులు, గీత కార్మికులు, స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. నష్టపోయిన వారికి నష్టపరిహారం లభించే వరకు డివిస్ ల్యాబ్స్ పరిశ్రమలో సుమారు 1000 మంది నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగ యువత, రైతులు, గీత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ రాకతో ఇతర పార్టీల నాయకుల పునరాలోచన :

దివీస్ కాలుష్యంపై పరిశ్రమలో 1000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు, గీత కార్మికులు, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ దివీస్ ల్యాబ్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టి కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో ఇతర రాజకీయ పార్టీలలో దివీస్ ల్యాబ్స్ విషయంలో ప్రజల పక్షాన నిలబడాలని గ్రామస్థాయి నాయకుల ఒత్తిడితో రాష్ట్ర స్థాయి నాయకులలో అంతర్మధనం మొదలైందని విశ్వసనీయ సమాచారం. మరోవైపు అంబుజా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని అఖిలపక్షం ద్వారా దివీస్ ల్యాబ్స్ పై ఉద్యమం చేపట్టాలని మునుగోడు నిరుద్యోగ యువత గీతకార్మికులు ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట మండలం పరిధిలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని ఇరవై రోజుల పాటు రాజకీయాలకు అతీతంగా ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు కాలుష్య పరిరక్షణ వేదిక పేరుతో అలుపెరగని పోరాటం చేయడంతో పరిశ్రమను పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఏర్పాటును అడ్డుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా అదే స్థాయిలో దివిస్ ల్యాబ్స్ పరిశ్రమపై ప్రజాసంఘాల యువజన సంఘాలు రాజకీయ పార్టీలతో కలసి ఒకే వేదిక ద్వారా ఉద్యమంలో కార్యాచరణ రూపొందించి ముందడుగు వేస్తే తప్పకుండా దీవీస్ ల్యాబ్స్ కాలుష్యంతో నష్టపోయిన గీత కార్మికులకు, రైతులకు, నష్టపరిహారం జరిగేలా దివీస్ ల్యాబ్స్ వెయ్యి మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు అఖిల పక్షం ద్వారా దివిస్ ల్యాబ్స్ పై పోరాటం చేస్తే తప్పక న్యాయం జరుగుతుందని మునుగోడు నియోజకవర్గ గీత కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువత, రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన నిలబడాలని కోరుతున్నారు.

YouTube player
Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS