మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఉద్యమాల గడ్డ పోరాటాల బిడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనుల ఎందరో…..మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు శరీరం కాలిపోతున్న జై తెలంగాణ నినాదం వీడని మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి మరణం యావత్ దేశానికి ఆలోచింపజేసింది. తెలంగాణ ఉద్యమం అనగానే మొదట గుర్తుకు వచ్చేది అమరవీరుల త్యాగం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయం. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనే ధ్యేయంగా అమరణ నిరాహార దీక్ష కు వెళుతున్న తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను పోలీసులు కరీం నగర్ జిల్లా అల్గునూరు వద్ద అరెస్టు చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ భగ్గుమన్నది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ అక్రమ అరెస్ట్ నిరసిస్తూ హైదరాబాదులోని ఎల్బీ నగర్ చౌరస్తా ఉద్యమ కాగడ అయ్యింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జై తెలంగాణ నినాదం చేస్తూ ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీకాంతచారి భగభగా మండి పోయిండు. ఉద్యమ మిత్రులు మంట లార్పేలోపే తీవ్రగాయాలతో కుప్ప కూలిపోయాడు. ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరా దుతూ కూడా తెలంగాణ స్మరణ చేశాడు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావ డానికైనా మళ్లీ సిద్ద మన్నాడు. తెలంగాణ బిడ్డ ఎగిసే మంటల్లో. బూడిదవుతుంటే టీవీల్లో చూసిన యావత్ దేశ ప్రజలకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి. ప్రతి ఒక్కరూ ఉద్య మానికి ఉద్యుక్తులయ్యోలా శ్రీకాంతచారి ఉద్యమ జ్వాల రగిలించాడు.
చివరకు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2009 డిసెంబర్ 3న 10గంటల 30 నిమిషాలకు వీరమరణం పొందాడు. శ్రీకాంత్ చారి త్యాగం యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఆలో చింపజేసింది సకల జనులను సబండ వర్ణాల ప్రజలను విద్యా ర్థులను మేధావులను అందరికీ రోడ్లపైకి తెచ్చింది. సీమాంధ్ర పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరే కంగా నిరసనలు బంధులతో తెలంగాణ ప్రాంతం అట్టుడికి పోయింది. ఉద్యమాల జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోత్కూరు మండలంలోని పొడి చెదు గ్రామంలో వెంకటాచారి శంకరమ్మ దంపతులకు 1986 ఆగస్టు 15న జన్మించారు. ఫిజియోథెరపీ కోర్సును ఉస్మానియా విశ్వవిద్యా లయంలో చదువుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వారు. హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న రాష్ట్ర సాధన ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండేవాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న శ్రీకాంతచారి రాష్ట్రసాధన కోసం హిమాలయాలంత త్యాగం చేశాడు. శ్రీకాంతచారి తెగింపు త్యాగం ధైర్యం తెలంగాణ ప్రజలకు వేగుచుక్కఅయ్యి దారి చూపింది. శ్రీకాంతచారి మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయం నెరవేరి మన కళ్ల ముందే కదలాడుతున్నది. శ్రీకాంతాచారి ఆశ యాల ప్రేమికులుగా బంగారు తెలంగాణ సా ధనలో మనమంతా నిమగ్నం కావడమే ఆయ నకు ఇచ్చే అసలైన సిసలైన నిజమైన నివాళి.
ఎల్-నరేష్ జాటోత్ (8247887267)