భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోని పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ విషయంపై పీవీ సింధు తండ్రి సీవీ రమణ మాట్లాడుతూ, ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత నెలలోనే వీరి పెళ్ళికి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని తెలిపారు. జనవరి నుండి పీవీ సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.