Friday, September 20, 2024
spot_img

ప్రేమను పంచడం , పెత్తనాన్ని ప్రశించడమే తెలంగాణ ప్రజల తత్త్వం : సీఎం రేవంత్ రెడ్డి

Must Read
  • నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ
  • ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
  • పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు
  • అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం
  • ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల తత్త్వం

ఎన్నో ఉద్యమాలు,మరెన్నో ఆత్మబలిదానాలు,బంద్ లు,రస్తారోకో లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణవాదులు ఒక్కతాటి పైకి వచ్చి ప్రత్యేక రాష్ట్ర కోసం కొట్లాడిన్రు.ఆంధ్ర పాలకులు కేసులతో భయపెట్టే కుట్రలు చేసిన,వేల మందిని జైళ్లల్లో పెట్టిన ఉద్యమం ఆగలేదు.శ్రీకాంత చారి అగ్నికి ఆహుతి అయితే,కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకీతో కాల్చుకున్నాడు , 1200 మంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం పిట్టల రాలిపోయారు.స్టీరింగ్ పట్టాల్సిన డ్రైవర్లు,కలం పట్టాల్సిన జర్నలిస్టులు, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు,పుస్తకాలూ పట్టాల్సిన విద్యార్థులు ఇలా ఒక్కర,ఇద్దర తెలంగాణ కోసం ప్రతిఒక్కరు ” జై తెలంగాణ ” నినాదాన్ని ఎత్తుకున్నారు.ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న ఉద్యమాన్ని చూసి కేంద్రం దిగొచ్చింది.దింతో జూన్ 02 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

                                         తెలంగాణ నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి అడుగుపెట్టింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు,ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు,సిపిఐ, సిపిఎం, టిజెఎస్ నాయకులూ , అమరవీరుల కుటుంబసభ్యులు,అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి,పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతమైన జయజయహే గేయాన్ని విడుదల చేశారు.ఈ పాటకు కీరవాణి సంగీతం రచించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీను ముఖ్యఅతిథిగా ఆహ్వానించగా అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు.దింతో సోనియాగాంధీ వీడియో క్లిప్ ద్వారా సందేశాన్ని పంపి తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


           ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరాని అన్నారు.ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల తత్వమని ఈ సందర్బంగా గుర్తుచేశారు.తెలంగాణ రాష్టం ఇచ్చిన సోనియా గాంధీను కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు రాష్ట్ర గీతం లేదని , అందేశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటిస్తున్నామని అన్నారు 

ప్రజాల ఆకాంక్షల మేరకే టీఎస్ ను టిజిగా మార్చమని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 48 గంటల్లో 02 గ్యారంటీలను అమలు చేశామని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించామని గుర్తుచేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంకెళ్లను తెంచి ప్రజాపాలన అందిస్తున్నామని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This