Thursday, December 12, 2024
spot_img

బిజెపి కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

Must Read
  • హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది
  • అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
  • అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు
  • హిమాచల్‎ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
  • బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది
  • హిమాచల్‎ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు
  • ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి అన్నో ఇన్నో సీట్లు
  • తెలంగాణ రాష్ట్రానికి మోడీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు
  • సరూర్‎నగర్ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా

రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. శనివారం హైదరాబాద్‎లోని సరూర్‎నగర్ స్టేడియంలో నిర్వహించిన బిజెపి బహిరంగసభలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. హిమాచల్‎ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వ్యాఖ్యనించారు. బిజెపి పార్టీ ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుందని దుయ్యబట్టారు. బిజెపి పార్టీ ఒంటరిగా పోటీచేసి 13 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని..తెలంగాణలో మార్పు రావాలంటే అది బిజెపి పార్టీతోనే సాధ్యమని అన్నారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలను మోసం చేసింది…ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు “నిరుద్యోగ భృతి” ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయలఫకీర్‎లా మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇది ప్రజాప్రభుత్వం కాదు…జాదుగిరి చేసే సర్కార్ అని నడ్డా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలుస్తే, వారిని ముంచుతుందని అన్నారు. హిమాచల్‎ప్రదేశ్‎లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పథకం అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, మహిళలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి, కనీసం కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్ పార్టీ అన్నోఇన్నో సీట్లు వస్తున్నాయని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఇంద్రజాలం తమాషా చేస్తుందని, ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని, అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. యాదవ, కురుమ సంఘాల వృత్తి అభివృద్దికి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పారు..ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు వ్యాఖ్యల సిద్ధాంతాన్ని పాటిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం మనుగడలో ఉంటుందో లేదో..తెలియదు..ఎన్నిరోజులైతే అధికారంలో ఉంటామో అన్నీ రోజులు రాష్ట్రాన్ని అప్పులతో నడిపిద్దాం అంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందనీ అన్నారు. అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవని వ్యాఖ్యనించారు.

ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, సబ్ కా సాత్- సబ్ కా వికాస్‎తో అయిన అందరికీ న్యాయం చేశారని అన్నారు. తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్​ 1.12 లక్షల గ్రాంట్లు, వరంగల్‎​కు రూ. 27 కోట్లు, టెక్స్​ టైల్​, రైల్వేకు రూ.20 రెట్లు బడ్జెట్​ కేటాయించారని తెలిపారు. ​మూడు వందేభారత్​ రైళ్లు, భారత్​ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్‎ ​- ఇండోర్​, సూరత్​- చెన్నై, హైదరాబాద్​ – విశాఖపట్నం లాంటి జాతీయ రహదారులు నిర్మించారని వెల్లడించారు. బీబీనగర్​ లోనూ ఎయిమ్స్​ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారన్నారు. బీజేపీ హామీ ఇవ్వనివి కూడా ఇచ్చి చూపెడుతుందని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చతికిలపడుతుందని జేపీ నడ్డా విమర్శించారు. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్​ అవాస్తవాలపై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జేపీ నడ్డా ఈ సందర్బంగా కోరారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS