Friday, September 5, 2025
spot_img

మదర్ ఆఫ్ ది సాయిల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Must Read

అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని రాసిన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకాన్ని పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సోనియా గాంధీ “తెలంగాణ దేవత” అని కొనియాడారు. తెలంగాణ కోసం ఆమె చూపిన సంకల్పం, పట్టుదల అనన్యమైనవి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు సోనియా గాంధీ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ప్రతి పోరాటంలో మన ఆవేదన, ఆశల కోసం సోనియా గాంధీ అందించిన మద్దతు వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఎదురైన సవాళ్లను, ప్రజల ఆవేదనను, పార్టీగా తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, పొన్నం ప్రభాకర్ ఉద్యమ కాలంలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను సాకారం చేయడానికి సోనియా గాంధీ చూపించిన పట్టుదల తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, కాంగ్రెస్ పార్టీ త్యాగం మరియు సోనియా గాంధీ నాయకత్వంవల్లే రాష్ట్ర కల సాకారం అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేము. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే అధికారం కోల్పోయినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This