సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.