ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణ
తల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే మాటలు నిజమో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు..
రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ అమ్మ చేతిలో లేకపోవడం కొంత బాధాకరమే.
ఇంకోసారి అధికారంలోకి వచ్చే వేరే పార్టీ ఏదైనా తెలంగాణ తల్లి విగ్రహా రూపం మార్చకుండా చట్టప్రకారం నడవాల్సిందే..