Wednesday, February 5, 2025
spot_img

సైబర్ నేరాలతో మానవులకు ముప్పు

Must Read
  • డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం కలుగుతుంది
  • డిజిటల్ యుగంలో ఎన్నో సవాళ్లూ : రాష్ట్రపతి
  • ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం : ముర్ము
  • సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఆందోళన
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని పిలుపు..

దేశంలో సైబర్ నేరాలతో కొత్త ముప్పు పరిణమిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ యుగంలో మరెన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. ‘మానవ హక్కుల దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన ప్రోగ్రామ్‎లో రాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం ఎన్నో సవాళ్లు పొంచి ఉన్నాయని ద్రౌపదీ ముర్ము తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం విస్తృతం వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలు, డీప్ ఫేక్, ప్రజల గోప్యతకు భంగం వంటి విషయాలు మానవులకు కొత్త ముప్పుగా పరిణమిస్తున్నాయన్నారు. వీటిని నివారించాలంటే ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని వివరించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలతో పాటు వాతావరణంలో వచ్చే వివిధ రకాల మార్పులను ఎదుర్కొంటోందని ముర్ము అన్నారు. ప్రస్తుతం ప్రజల జీవితాల్లో ఏఐ ప్రభావం గురించి ఆమె మాట్లాడుతూ “కృత్రిమ మేధ ఇప్పుడు మన రోజూవారీ జీవితంలోకి ప్రవేశించింది. మన సమస్యలను పరిష్కరిస్తోంది. కానీ మనకు తెలియకుండానే పలు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. దీనికి ప్రాణం లేకపోయినా సృష్టించింది మానవులే కాబట్టి.. ఈ సవాళ్లకు మనమే తగిన పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. సార్వత్రిక మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1948లో ఆమోదించింది. ఆ తీర్మానంలో రూపొందించిన హక్కులు, స్వేచ్ఛపై అందరిలోను అవగాహన పెంచి, వాటి అమలుకు రాజకీయ దృఢ సంకల్పాన్ని పెంపొందించడానికి ఏటా డిసెంబరు 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకొంటున్నాం. ప్రజల్లో మానవ హక్కులపై అవగాహన పెంచడానికి, ప్రభుత్వాలు మరింత బలంగా వాటి పరిరక్షణకు పూనుకోవడానికి ఈ కార్యక్రమాలు ప్రేరణగా నిలిచే అవకాశం ఉందని ఐరాస పేర్కొంది. ఇందులోభాగంగా రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాకారం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ పొంచి ఉన్న ప్రమాదాలను గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయ్యే తప్పుడు విషయాలను అరికట్టాల్సిన అవసరముందని ముర్ము పేర్కొన్నారు.

Latest News

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS