Wednesday, December 18, 2024
spot_img

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌

Must Read
  • రుణాలపై తప్పులు నివేదిక సమర్పించిన కాంగ్రెస్‌
  • రూ.3.89 లక్షల కోట్లు ఉందని ఆర్బీఐ చెబితే రూ.7 లక్షల చూపి తప్పుదోవ
  • విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌పై తప్పుడు నివేదికలు వెల్లడిరచిందని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ’’హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌’’ పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో నిరూపితమైందని కేటీఆర్‌ అన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్ల‌డించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చిన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అప్పులు కేవలం రూ.3.89 లక్షల కోట్లు అని ఆర్బీఐ నివేదికలో స్పష్టం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.7లక్షల కోట్లు అంటూ తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. రాష్ట్ర అప్పులపై ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారమిచ్చి, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారని అన్నారు. అందుకే తెలంగాణ శాసనసభ కార్య విధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని చెప్పారు.

లగచర్ల దాడి బాధ‌క‌రం

ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న అంశంలోనూ సభా హక్కుల నోటీసులు ఇచ్చామని తెలిపారు. లగచర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు, టూరిజంపైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వ ప్రాధాన్యతలకు అద్దం పడుతుందని కేటీఆర్‌ విమర్శించారు. లగచర్ల అంశంపై శాసనసభలో చర్చించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. అసలైన అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం సవరణ స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సవరణ ఇవ్వని పక్షంలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. గతంలో తానే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్‌ మోషన్‌ను అప్పటి స్పీకర్‌ మనోహర్‌ అంగీకరించారని గుర్తుచేశారు. దానిపై అప్పుడు సభలో చర్చ జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రివిలేజ్‌ మోషన్‌ కు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశామని తెలిపారు. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకుని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ శాసనసభలో అనుమతి ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్‌ నేతలు అప్పులపై బయట కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పు అంటూ లేని అప్పు గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు చెబుతున్న అప్పుల లెక్కలు తప్పు కాబట్టి.. ఈ ప్రభుత్వం కడుతున్నామని చెబుతున్న నెలకు 6వేల 500 కోట్ల వడ్డీ లెక్కలు కూడా తప్పే అని స్పష్టం చేశారు. ఏడాదికి కేవలం రూ.22 వేల కోట్ల వడ్డీ మాత్రమే కడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైనే రాష్ట్ర ప్రభుత్వం చర్చకు స్వీకరించడం బాధాకరమని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఢల్లీి టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢల్లీికి 100కి పైగా చేసిన పర్యటనలతో ఢల్లీి టూరిజం బాగా పెరిగిందని విమర్శించారు. మరోవైపు 40 మంది లగచర్ల రైతులను జైలులో పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తల నుంచి మొదలుకొని పార్టీ నాయకులను జైల్లో పెడుతున్న జైలు టూరిజం.. బెయిల్‌ వచ్చిన తర్వాత కూడా నటులను జైలులో ఉంచుతున్న జైలు టూరిజం.. ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుంటే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి చేస్తున్న జైలు టూరిజం.. ఈ విధంగా తెలంగాణలో జైలు టూరిజం బాగా నడుస్తుందని అన్నారు. సర్పంచ్‌ల సమస్యలపై కూడా శానస సభలో చర్చకు లేవనెత్తామని కేటీఆర్‌ తెలిపారు. సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల పెండిరగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశామన్నారు. గత నెలలో బడా కాంగ్రాక్టర్లకు ఇచ్చిన రూ.1200 కోట్ల నిధుల్లో సగం ఇస్తే.. సర్పంచ్‌ల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని స్పీకర్‌ కు కూడా విజ్ఞప్తి చేశామని నచెప్పారు. లగచర్ల అంశంపై కూడా సభలో చర్చించాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్‌ తెలిపారు. రైతులను అక్రమంగా జైలులో ఉంచిన కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుపై రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని శాసన సభలో తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

Latest News

భయం గుప్పిట్లో జగన్నాథ దేవాలయం

కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్? ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS