Wednesday, December 18, 2024
spot_img

గురుకులాలంటేనే కేసీఆర్‌ గుర్తుకొస్తారు

Must Read
  • సమస్యలపై చర్చించాలంటే పారిపోతున్న కాంగ్రెస్‌
  • కాంగ్రెస్‌ వద్ద సరైన లెక్కలు కూడా లేవు
  • మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Governament) వద్ద స్కూళ్లపై సరైన లెక్కలు కూడా లేవని, స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై చర్చించాలని కోరామని, విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమతించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురుకులాలు అంటే ఈ ప్రభుత్వానికి కేసీఆర్‌నే కనిపిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో 5 లక్షల మంది చదువుతున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఈ ఏడాది 2 లక్షల మంది తక్కువగా చేరారని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. కేవలం 10 మంది విద్యార్థులున్న దాదాపు 4 వేల స్కూళ్లు ఉన్నాయని చెప్పారు. 10 మందికి లోపు విద్యార్థులున్న స్కూళ్ల టీచర్లను వేరే చోటికి బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 6 వేల స్కూళ్లు మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

కేసీఆర్‌ హయాంలో విద్యార్థులకు మార్నింగ్‌ బ్రేక్‌పాస్ట్‌ ఇచ్చామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఎత్తిసిందని అన్నారు. విషాహారం, కుక్క, పాముకాట్లతో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. అటు అసెంబ్లీలో.. ఇటు బయట ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. మేం స్కూళ్లకు వెళ్లి చూస్తామంటే కూడా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైందని పేర్కొన్నారు. విద్యారంగానికి సంబంధించి కాంగ్రెస్‌ 20 హామీలు ఇచ్చిందని తెలిపారు. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. మూసివేయాలని చూస్తున్న స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని సూచించారు.

Latest News

భయం గుప్పిట్లో జగన్నాథ దేవాలయం

కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్? ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS