Friday, November 22, 2024
spot_img

మరో 48 గంటల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది : మంత్రి జూపల్లి కృష్ణ రావు

Must Read

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా నవీన్ కుమార్ 111 ఓట్లతో గెలిచారని తెలిపారు.
300 పైగా ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ బలం 652 ఓట్లకు పెరిగిందని తెలిపారు.బీఆర్‌ఎస్‌కు 763, కాంగ్రెస్‌కు 652 ఓట్లు వ‌చ్చాయి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ స్థానిక నాయకులూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని , కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చుసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. మ‌రో 48 గంట‌ల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుందని, బీఆర్ఎస్ పార్టీ మాదిరి త‌ప్పుడు ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంభించ‌లేదని అన్నారు. ప్రజస్వామ్య పద్దతిలోనే ఎన్నికల్లో పోటీ చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప‌ని చేసిన కాంగ్రెస్ పార్టీ నాయ‌కులకు , కార్య‌క‌ర్త‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో విజ‌యం సాధించ‌బోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నిజాయితీగా ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని అభినందిస్తున్నని తెలిపారు. సముద్రంలో మునిగిపోయే వ్యక్తికి గడ్డిపోస దొరికినట్లు బీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ దక్కింది అని ఎద్దేవా చేశారు.జూన్ 04 తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగిలారని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప‌డ‌వ మునిగిపోతుందని జోశ్యం చెప్పారు.

Latest News

పోలీస్ ఉద్యోగం..క్రమశిక్షణతో కూడుకున్నది

తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ పోలీస్‌ ఉద్యోగం అంటే క్రమ శిక్షణతో కూడుకున్నదని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ ఆర్‌.బి.వీ.ఆర్‌ ఆర్‌, శిక్షణ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS