Wednesday, December 18, 2024
spot_img

పంచాయితీలకు బిల్లుల చెల్లింపు

Must Read
  • అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ
  • ప్రభుత్వం తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ వాకౌట్‌
  • బకాయిల రాష్ట్రమితి అంటూ సీతక్క కౌంటర్‌

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడుదల చేస్తున్నారని..కానీ సర్పంచులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రూ.691 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. దీనికి మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు. గత ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటే బాగుండేదని చురకలంటించారు. బిఆర్‌ఎస్‌ అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌ ల బకాయిలు తమ ప్రభుత్వానికి బిఆర్‌ఎస్‌ వారసత్వంగా ఇచ్చిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.274 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని హరీశ్‌ చెప్పారు. అయితే ప్రభుత్వ తీరునకు నిరసనగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. సోమవారం ఉదయం మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు మాట్లాడుతూ.. సర్పంచుల పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ. 691 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి విమర్శించారు. ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోస పెడుతున్నారని నిలదీశారు. గవర్నర్‌, మంత్రులను కలిసి సర్పంచులు మొరపెట్టుకున్నారని.. చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్టు చేశారని చెప్పారు. అయితే, సర్పంచుల పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వట్లేదని బిఆర్‌ఎస్‌ మెంబర్స్‌ నిరసన తెలుపుతూ.. శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.

Latest News

భయం గుప్పిట్లో జగన్నాథ దేవాలయం

కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్? ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS