- ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు
- ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏ2
- రూ.55 కోట్ల అవకతవకలు జరిగాయన్న సర్కార్
- విదేశీ కంపెనీలకు పర్మిషన్ లేకుండా భారీ మొత్తంలో నిధుల మళ్లింపు
- అసెంబ్లీలో స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్
- ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో చర్చించాలని స్పీకర్ కు రిక్వెస్ట్
బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి అని పెద్దలు చెబుతారు. అయితే ఈ సామెత కల్వకుంట్ల తారకరామారావుకు కరెక్ట్ గా సూట్ అవుద్ది. తెలంగాణలో గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్(BRS).. వాళ్ల హయాంలో కల్వకుంట్ల ఫ్యామిలీయే రాష్ట్రాన్ని ఏలిందని చెప్పవచ్చు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్ వీళ్ల చెప్పు చేతల్లోనే తెలంగాణ బంధీ అయిపోయింది. ఇన్నాళ్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉండే. కానీ గడీల పాలనకు రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పారు. ఆరు దశాబ్ధాల కళ, వందలాది మంది విద్యార్ధులు, నిరుద్యోగుల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో ఎవరూ బాగుపడలే కానీ.. కేవలం కల్వకుంట్ల వారికే అంతా మంచి జరిగాయి. అన్ని జాబులు, ఆదాయం, నీళ్లు వారికే వచ్చాయని కేసీఆర్ ను గద్దె దించి ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు. మంత్రి, సొంత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలువనివ్వని వీరి అహంకారం ప్రజల కోపాగ్నికి ఆహుతి అయ్యాయి. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి కేసీఆర్ కుటుంబానికి చావు దెబ్బ కొట్టారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, దళిత బంధు వంటి అనేక స్కీమ్ ల్లో భారీగా అవినీతి జరిగింది. కాగా అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ 10ఏళ్ల హయాంలో వాళ్ల ఫ్యామిలీ చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. అందులో భాగంగా కాళేశ్వరం తండ్రికి చుట్టుకోగా, ఫార్ములా ఈ-కార్ రేస్ కేటీఆర్(KTR) మెడకు ఉచ్చు బిగుస్తుంది.
కేటీఆర్ ఒకటి, రెండ్రోజుల్లో అరెస్ట్.? :
ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహరంలో కేటీఆర్(KTR)పై కేసు నమోదు అయ్యింది.. అరెస్ట్ వరకు తీసుకొచ్చింది. ఒకటి, రెండ్రోజుల్లో మాజీ మంత్రిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలంటూ ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
గవర్నర్ అనుమతితో కేటీఆర్(KTR) పై కేసు :
ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. రెండు రోజుల క్రితం సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్‌ఎన్ రెడ్డిని చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు. 2023 ఫిబ్రవరి 11 మొదటి దఫా కార్ రేసింగ్ నిర్వహించగా, 2024 ఫిబ్రవరి 10న ఫార్ములా 10 ఈ రేసింగ్ కారును నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రేసింగ్ నిర్వహించడంలేదని విదేశీ కంపెనీ ప్రకటించింది. దీంతో దీనిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్‌కు.. దాదాపు రూ.55 కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ, సంబంధిత శాఖ నుంచి రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ.. ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించి ఆపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురి విచారణ విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ-కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చిద్దాం : కేటీఆర్
మరోవైపు ఫార్మూలా- ఈ-కార్ రేస్ కేసులో తన పైన కేసు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో స్పందించారు. ఇప్పుడే తమ సభ్యులు చెబుతున్నారని, తనపై ఏదో కేసు నమోదు చేశారని చెప్పారని కేటీఆర్ సభకు తెలిపారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే.. నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా ఈ-కార్ రేస్ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని స్పీకర్ ను కేటీఆర్ కోరారు. ఈ-రేసులో జరిగిన అన్ని అంశాల పైన చర్చకు సిద్దంగా ఉన్నానని కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారని, కేటీఆర్పై అన్యాయంగా ఎన్ఐఆర్ నమోదు చేశారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మూలా- ఈ-కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేస్ నిర్వహించామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.