Friday, December 27, 2024
spot_img

మిత్రపక్షాల మధ్య మరింత సమన్వయం

Must Read
  • నడ్డా నివాసంలో ఎన్టీఎ పక్షాల భేటీ
  • అమిత్‌ షా, చంద్రబాబు తదితరుల హాజరు

మిత్రపక్షాల సమన్వయం పార్లమెంట్‌ లోపల, బయటా మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, జేడీఎస్‌ ముఖ్యనేత కుమారస్వామి, ఇతర నేతలు హాజరయ్యారు. అంబేడ్కర్‌పై అమిత్‌ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్‌లో రేగిన దుమారం సహా పలు రాజకీయ అంశాలపై ఎన్డీయే నేతలు చర్చించినట్టు తెలిసింది. వాజ్‌పేయీ శత జయంతి వేళ సుపరిపాలన అంశంపైనా నేతలు సమాలోచనలు జరిపారని సమాచారం. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్టు తెలిసింది. మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్‌సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించినట్టు సమావేశం అనంతరం తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఎన్డీయే భేటీ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి.. సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గ్టటెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైల్వే జోన్‌ సహా, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు పలువురు ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. సుపరిపాలన, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో పాల్గొన్నవారిలో జేడీయూ నేత, కేంద్రమంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, అప్నాదళ్‌ (ఎస్‌) అధ్యక్షురాలు, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్‌, జేడీఎస్‌ నేత, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (ఎస్‌) నేత, కేంద్రమంత్రి జితన్‌ రామ్‌, ఆర్‌ఎల్‌ఎం అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, భారత్‌ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్‌ వెల్లప్పల్లి తదితరులు హాజరయ్యారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లుల పరిశీలనకు పీపీ చౌధరి సారథ్యంలో ఏర్పాటైన జేపీసీ జనవరి 8న సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా కుట్ర

బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది బెళగావి సదస్సులో రాహుల్‌ ఆరోపణలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS