Sunday, November 10, 2024
spot_img

కరీంనగర్ నగరపాలక సంస్థలోదానయ్య అక్రమాల దందా

Must Read
  • హై లెవల్ వాటర్ ట్యాంక్ లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న దానయ్య
  • హై లెవెల్ లో అక్రమాలు చేస్తూ లక్షల్లో వసూలు
  • అవినీతి సొమ్ములో భాగస్వామ్యులైన అధికారులు
  • అక్రమాల పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కార్పొరేటర్
  • నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి : కార్పొరేటర్ రాపర్తి విజయ

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారుల అండదండలు చూసుకొని అక్రమాలకు పాల్పడుతూ లక్షలాది రూపాయలను దోచుకుంటున్నాడు.ఇతగాడు చేస్తున్న అక్రమాల పై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన ఎవరు ఏమి చేయలేరనే ధైర్యంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు.ఇక ఈ ఉద్యోగి వెనుక కరీంనగర్ నగరపాలక సంస్థ అధినేత వున్నాడని, ఆ అధినేతకు, మరియు ఉన్నతాధికారులకు వాతా వెళ్తుందని సహచరుల వద్ద ధీమాగా చెప్తూ , విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. తాజగా ఇతను చేస్తున్న అక్రమాల పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు 58 డివిజన్ కార్పొరేటర్ రాపర్తి విజయ.

కరీంనగర్ నగరపాలక సంస్థలో హై లెవెల్ వాటర్ ట్యాంక్ లో ఫిట్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న దానయ్య పలు అక్రమాలకు పాల్పడుతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. కమర్షియల్ నల్లా కనెక్షలను ,రెసిడెన్షియల్ కనెక్షన్లుగా అమర్చి అక్రమంగా కనెక్షన్ లు ఇస్తూ నగరపాలక సంస్థకు రావాల్సిన లక్షలాది రూపాయలను దోచుకొని , అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నాడని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తనకు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు ఉండడంతో వారి అండదండలు చూసుకొని భారీ కుంభకోణానికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో దానయ్య చేస్తున్న అక్రమాల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని , కమర్షియల్ కాంప్లెక్స్ లకు సుమారు 8 నుండి 10 గంటల సప్లయ్ వుండే మెయిన్ పైప్ లైన్ ద్వారా కనెక్షన్లు ఇస్తూ వారి నుండి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇతను తీసుకుంటున్న లంచాల నుండి కొంతమంది ఉన్నతాధికారులకు ప్రతినెల కొంత వాటా అందిస్తున్నట్టు తెలిపారు. అనేక మంది లీకేజ్ లేబర్ లను,ఇతర లేబర్ లను కాంట్రాక్టు బేసిస్ లో నియామకాలు చేయించి ఒక్కో లేబర్ నుండి సుమారు రూ 1,20,000 నుండి 1,50,000/- వసూలు చేసినట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.తనకు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం చెబితే ఆ కార్మికులను పనులలో నుండి తీసేస్తానంటూ బెదిరించినట్టు తెలిపారు. దానయ్య చేస్తున్న అక్రమాల పై నిష్పక్షపాతంగా ఉన్నత అధికారులు దర్యాప్తు చేయాలని , లక్షలాది రూపాయల ప్రజాధనం లూటీ కాకుండా కాపాడాలని లేఖలో పేర్కొన్నారు.

Latest News

తెలంగాణ సర్కార్ పై మోదీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‎పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS