- బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది
- బెళగావి సదస్సులో రాహుల్ ఆరోపణలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఓటర్ల జాబితాలో కుట్ర జరిగిందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 72 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని తెలిపారు. ఆ నియోజకవర్గాల్లో 102 స్థానాలను బీజేపీ గెలుచుకుందని వెల్లడిరచారు. ఓటర్ల జాబితాలో మార్పులు కారణంగానే బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఫలితాల వెనుక సీఈసీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. ఎన్నికల సంఘాన్ని కలిసి ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలను, ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఎత్తి చూపించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత 47 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని చేపించింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. కేవలం 2 శాతం మందే కొత్తగా చేరారని తెలిపింది. కొత్త ఓటర్లంతా 18-19 వయసు వారని పేర్కొంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలే గెలుచుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) (ఓజీనిపనీఠజీని ªూతినిణఠ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎయిమ్స్ వద్ద భద్రతను పెంచారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్‌ను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్.. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.