Wednesday, February 5, 2025
spot_img

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిన భారత్‌

Must Read
  • ఆయన మరణం దేశానికి తీరని లోటు
  • భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన చంద్రబాబు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో మన్మోహన్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని.. అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటు.. కానీ, ఆయన భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు. ఢిల్లోని మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌ అని పేర్కొన్నారు.. మన్మోహన్‌ లేని లోటు ఎవరూ పూడ్చలేరన్న ఆయన.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, యూజీసీ చైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌ గా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించారు.. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారని గుర్తుచేశారు.. ఇక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దశ దిశను రూపొందించారు మన్మోహన్‌ అని కొనియాడారు చంద్రబాబు నాయుడు.. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్టీఐ చట్టం, నరేగా, ఆధార్‌ లాంటి ఎన్నో పాలసీలు తీసుకొచ్చారు.. మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఉన్నతమైన పదవుల్లో పనిచేసిన వ్యక్తి మన్మోహన్‌ సింగ్‌.. ఆయన మంచి రాజకీయ నాయకుడన్న చంద్రబాబు.. మన్మోహన్‌ సింగ్‌ భావజాలం శాశ్వతంగా ఉంటుందన్నారు.. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటు.. బాధాకరం అంటూ చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు.. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని, తెదేపా ఎంపీలు కేశినేని చిన్ని, శబరి మాజీ ప్రధాని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

Latest News

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS