Monday, April 21, 2025
spot_img

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు భారీ ఆర్థిక చేయూత

Must Read
  • రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం
  • కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ మంత్రి రామ్మోహన్‌ ట్వీట్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్‌ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారికంగా వెల్లడించారు.. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజ్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో స్టీల్‌ ప్లాంట్‌ ఆపరేషనల్‌ పేమెంట్స్‌ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్‌ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఊపిరి పోసేలా రివైవల్‌ ప్యాకేజీ కింద రూ.11,400 కోట్లు కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నష్టాలను అధిగమించి, ప్లాంట్‌ పూర్తి స్థాయి ఉత్పాదనతో లాభాల బాట పెట్టేందుకు ఈసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం‘ అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ట్వీట్‌ చేశారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్‌ పూర్తి ఉత్పాదనతో లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందన్నారు. రాష్టాభ్రివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS