Thursday, January 23, 2025
spot_img

బల్దియా కమిషనర్‌ బిల్లులు ఇవ్వలేక కొర్రీలు పెడుతున్నారు

Must Read
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ కమీషనర్‌ ఈలంబర్తి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మేనా ?
  • నెలలు గడుస్తున్న బిల్లులు రాక అవస్థ పడుతున్న కాంట్రాక్టర్లు
  • బల్దియా ప్రాంతం ఇంటి పన్ను వసులు చేసిన సొమ్ము దారి తప్పిందా?
  • నోటీసులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు..
  • బిల్లులు ఇవ్వడం లేదంటూ రోదిస్తున్న కాంట్రాక్టర్ల కుటుంబాలు
  • బ‌ల్దియా బాస్‌ త్వరలో బిల్లులు ఇవ్వకుంటే కాంట్రాక్టర్ల కార్యచరణ రంగం సిద్ధం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బల్దియా కమిషనర్‌ కాంట్రాక్టర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు నిరసన బాట పట్టారు. గడిచిన 15 నెలల నుంచి బిల్లులు చెల్లించడంలో జాప్యం చేయడం పట్ల కాంట్రాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. రవీందర్‌ సాగర్‌ సంగిశేట్టి మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురు చేసిన తప్పిదంతోనే అందరి బిల్లులు ఆపడంమెందుకని ఆవేదన వ్యక్తం చేస్తారు. కాంట్రాక్టర్లు పడే బాధలు వర్ణనానితమని ఆయన అన్నారు. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు అనేకమంది ఫోన్‌ కాళ్లతోనే ఇబ్బంది పడుతున్నామని మెటీరియల్‌ ఇచ్చిన వ్యక్తులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరిచారు. అప్పులు తెచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఫైనాన్స్‌ యజమానులు ఇతర బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మేము తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు పెరగడంతో, కుటుంబ పోషణ భారం పెరిగిపోతుంది, పిల్లల ఫిజులు, ఇంటి అద్దెలు కట్ట లేక తీవ్ర ఒత్తిళ్లకు లోన అవుతున్నా మని, పెళ్లికి ఏదిగినా పిల్లల పెళ్లిళ్లు చేయలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు అసలు కట్టలేక, కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య శరణ్యమని ఆత్మహ త్యలకు పాల్పడుతున్నారు, అయినా అధికారులు జాలి చూపకుండా మిగతా పనులకు నోటీసులు ఇచ్చి, పనులు చేయమని వేధిస్తూ ఉన్నారని, అలాంటి పరిస్థితులలో గుండెపోటు లాంటి వ్యాధులు వచ్చి చనిపోతున్నా రని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత బిల్లులు రాక, చేసినటువంటి పనులను పనులకు బిల్లులు రాయక ఏఈ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీ ర్‌ లు లంచాలు ఇవ్వమని లంచాలు ఇవ్వకుంటే బిల్లులు రాయమని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండిరగ్‌ బిల్లులపై దృష్టి పెట్టి, ఈ అప్పుల బాధ నుండి మమ్ములను బయట వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రవీందర్‌ సాగర్‌ సంగిశెట్టి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వసంత్‌ కుమా ర్‌ శివరాం శంకర్‌ అలీ బాయ్‌ చందు నరసింహ చంద్రయ్య వెంకటయ్య సైదులు నిజాముద్దీన్‌, సలీం అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS