ప్రస్తుత ప్రపంచ రాజకీయ,ఆర్ధిక పరిణామాలు అత్యంత గందర గోళంగా ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం ఒకవైపు ప్రపంచ ప్రజల జీవితాలను తల్లక్రిందులు చేస్తుంటే, జరుగుతున్న యుద్ధాలు, యుద్ధోన్మాద హెచ్చరికలు అత్యంత భయానకంగా ఉన్న తరుణం లో అమెరికా కురువృద్ధ రాజకీయ నాయకుడు ట్రంప్ మరో పర్యా యం అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధ విరమణకు ట్రంప్ ఎలాంటి ప్రతి పాదన చేస్తారో వేచి చూడాలి.ఇప్పటికే ప్రపంచం యుద్ధ వాతా వరణంలోకి జారిపోయింది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల సం గతి అటుంచినా, భవిష్యత్తులో జరగబోయే యుద్ధాల నివారణకు అగ్రదేశాలు నడుంబిగించాలి. పట్టుదలకు, పంతాలకు పోయి ప్రజ లను ఇబ్బందులకు గురిచేయడం, అధిపత్య ధోరణులతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి, ఏదో సాధించామని భ్రమించడం అమానుషత్వం. యుద్ధాలు నాగరిక ప్రపంచంలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ఠ. ఇప్పటికే హమాస్ మిలటెంట్లకు, ఇజ్రాయిల్ కు మధ్య జరిగిన దమనకాం డలో గాజా రక్తసిక్తమై విలపించింది. రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు సంభవించునో అవగతం కావడం లేదు.ఇక ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య జరిగిన సంఘర్షణలో క్షిపణుల వర్షం కురిసింది. హెజ్బొల్లా దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ ప్రతి దాడులకు పూనుకొని ప్రపంచాన్ని భయభ్రాంతుల్లోకి నెట్టింది. ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య చర్చలు జరుతున్నాయని వార్తలు వెలువడుతున్నా, గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆగలేదు. మహిళలు, పిల్లలు ఆసుపత్రులు, ఆశ్రమాలు అనే బేధం లేకుండా ఇజ్రాయిల్ ఇప్పటికే గాజాను రక్తసిక్తం చేసింది. ఇజ్రాయిల్, హెజ్భుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వలన లెబనాన్ లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇప్పటికే లెబనాన్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రజలు, హిజ్బెల్లా నాయకులు మరణించారు. గాజాలో హిజ్బెల్లా వర్గాలు హమాస్ మిలటెంట్లకు మద్ధతు ప్రకటించిన కారణంగానే ఇజ్రాయిల్ హమాస్‌పై దాడు లను తీవ్రతరం చేసి,లెబనాన్ లో రక్తపాతం సష్టించింది. పశ్చిమా సియాలో మారణహోమానికి ఇప్పట్లో ముగింపు పలికే అవకా శాలు కనిపించడం లేదు.పైగా తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేలోగా ఇజ్రాయిల్, అమెరికాకు చెందిన బంధీలను విడిచి పెట్టాలని, లేకపోతే పశ్చిమా సియా తీవ్రమైన పరిణామా లను చవిచూడవలసి వస్తుందని ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ హెచ్చ రించారు.ఇక రష్యా- ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధంలో ఇరుదేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాయి. లక్షల సంఖ్యలో సైన్యం మరణించింది. ఈదారుణ మారణకాండలో ఎంతోమంది అమాయక ప్రజల ఊపిరి గాలిలో కలిసి పోయింది. ఉక్రెయిన్ కు సంబంధించిన పలు భూభాగాలు రష్యా అధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్ కూడా రష్యాకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అయితే అమెరికా,నాటోల సహాయం లేనిదే ఉక్రెయిన్ ముందుకు సాగే అవకాశం లేదు. పుతిన్, జెలెన్ స్కీలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా గౌరవప్రదంగా యుద్ధాన్ని ముగించడాని కే మక్కువ చూపిస్తున్నారు.నాటో కూటమిలో చేరికను ఉక్రెయిన్ విరమించు కోవాలని రష్యా డిమాండ్ చేస్తుండగా, కొంతకాలం వాయిదా వేసు కుంటామని షరతులతో కూడిన సంధికి ఉక్రెయిన్ అంగీకరిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు చమురును అమ్ముకుని రష్యా యుద్ధం చేస్తుండగా, తమ భూభాగం గుండా వెళ్తున్న రష్యా చమురు దారులను ఉక్రెయిన్ మూసి వేసింది. నాటో అందించే ఆయుధ, ఆర్ధిక సహాయంతో రష్యా పై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ అదంతా తన స్వీయ బలంగా భావిస్తే పొర పాటు. తాను అధికారం లోకి వస్తే ఉక్రెయినకు సహాయం నిలిపి వేస్తానని ఎన్నికల సమయం లోనే ట్రంప్ చెప్పడం జరి గింది. పుతిన్ ట్రంప్‌కు రహస్య మిత్రు డుగా పేరున్నది. ట్రంప్ సారథ్యంలో రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం పరిసమాప్తి కావాలని శాంతి కాముకులు వేయికళ్ళ తో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ట్రంప్ శ్వేత సౌధంలో ప్రవేశించ బోతున్న సందర్భంలో కెనడా పట్ల ప్రద ర్శిస్తున్న వైఖరి ప్రపం చాన్ని ఆశ్చర్య పరచింది. కెనడా అమెరికాలో 51 వ రాష్ట్రంగా కలిసి పోతేనే ఆర్ధికపర మైన పన్నుల భారం తగ్గిస్తామని ట్రంప్ పేర్కొనడం కేవలం కెన డానే కాదు పలు సార్వభౌమత్వ దేశాల మనుగ డను ప్రశ్నించి నట్టుగా భావించాలి. ఇప్పటికే పలు రకాల సమ స్యల కారణంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుండి వైదొలిగారు. కెనడాలో లక్షల సంఖ్యలో గల సిక్కుల ఓట్ల కోసం భారత్‌పై నిందలు మోపి, ఖలీస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంలో భారత్‌ను అనుమానిత దేశంగా పేర్కొని, అక్కడి భారత హైకమీషనర్ సంజయ్‌కుమార్ వర్మపై విచారణ జరుపుతామని ప్రకటించడం ద్వారా భారత – కెనడా దౌత్య సంబం ధాలను దెబ్బతీసి, ట్రూడో పలు దేశాల ఆగ్రహానికి కారణమై నాడు. ఆర్ధిక సంక్షోభంతో విల విల్లాడుతున్న కెనడాకు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందం గా అమెరికా తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా కెనడాను అమెరికాలో విలీనం చేయడానికి ప్రయత్నించడం, పన్ను పోటుతో కెనడాను వెన్ను పోటు పొడవాలని చాకచక్యంగా పావులు కదులు తున్నది. ఇక భారతదేశం విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉం టుందో ఇప్పుడే చెప్పలేము. వలస వాదులకు వీసాలు మంజూరు చేయకుండా, అమెరికా పౌరులకే ఉద్యోగావకాశాల్లో అగ్రతాం బూల మివ్వాలను కుంటున్న ట్రంప్ ఆదిశగా అడుగుల వేస్తే తెలుగు రాష్ట్రాల యువతకు విద్య, ఉద్యోగావకాశాల్లో భారీ స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదముంది. వీసాల విషయంలో బైడెన్ అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని పదవి నుండి వైదలగు తున్న నేపథ్యంలో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు ట్రంప్ విలువి స్తారా? సెలవిస్తారా అనే విషయం త్వరలోనే తేటతెల్ల మవుతుంది. ఇక చైనా విషయంలో అమెరికా భారత్ వైపే మొగ్గు చూపే అవ కాశ ముంది. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఎన్నికల ద్వారా సాధ్య పడుతుందా? ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో శర ణార్ధిగా ఉంటున్న తరుణంలో ఆమెపై కేసులు మోపి, ఆమెను బంగ్లాదేశ్ కు రప్పించి, శిక్షించాలను కుంటున్న బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం సైనిక కనుసన్నల్లో, హసీనా చిరకాల రాజకీయ ప్రత్యర్ధి మాజీ ప్రధాని బేగం ఖలీదా పరోక్ష మద్దతుతో నడుస్తున్నది. హసీనా లేకుండా జరిగే ఎన్నికల వలన బంగ్లాదేశ్‌లో ప్రజా స్వామ్య పునరుద్ధరణ జరగదు. బంగ్లా దేశ్ ఆవిర్భా వానికి, అభివృద్ధికి, అక్కడి ప్రజల మౌలిక సదుపాయాలకు ఎంతో సహాయ పడిన భారత్‌పై బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దువ్వడం, అక్కడ స్థిరపడ్డ భారతీయులపై పైశాచికంగా దాడులు చేసి, చంప డం అత్యంత బాధాకరం. హసీనా ప్రభుత్వ పతనంలో అమెరికా అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకోబోతున్న బైడెన్ పరోక్ష హస్తము న్నదనే అనుమానాలున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినా బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెద్దగా మార్పేమీ ఉండదు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా భారత్‌కు ఒరిగేదేమీ ఉండదు.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463
Must Read