- క్రిమినల్ కేసు విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి భారీ ఊరట లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గానూ దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2018 లో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్‌పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్.. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి జార?ండ్ కోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ పరువునష్టం కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో తనపై విచారణను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణపై స్టే విధించింది. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వానికి, బీజేపీ నేత నవీన్ రaాకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.