- టీడీఎస్ నిధుల విడుదల పట్ల హర్షం
- సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
- తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
రాష్ట్రంలో పురపాలికలు, నగరాల్లో విద్యుత్ దీపాల నిర్వహణ కాంట్రాక్టు పై ఇఇఎస్ఎల్ (ఎనర్జి ఎపిసెన్సీ సర్వీసింగ్ లిమిటెడ్) సంస్థకు చెల్లింపులపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు. గత ప్రభుత్వం పురపాలికలకు విద్యుత్ నిర్వహణ, సరఫరా భారం పడోద్దని విద్యుత్ సామాగ్రి, విద్యుత్ దీపాల కోనుగోలు భారాలు మున్సిపాలిటీలకు ఆర్ధిక భారం పడకుండా ఇఇఎస్ఎల్ సంస్థకు అప్పగించింది.ఈ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం ఉద్దేశం విద్యుత్ చార్జీల ఆదా చేసిన మెత్తం నుండి చెల్లింపు చేయాల్సి ఉండగా ఎక్కడ ఎనర్జీ ఆడిట్ కాకుండా ఎంత ఆధ జరిగిందో నిర్ధారించకుండ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ రూ వందల కోట్ల చెల్లింపు జరిగాయని, ఎలాంటి సాంకేతిక శాస్త్రీయ విధానం లేకుండా చెల్లింపులు జరిగాయని పేర్కోన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దీని దీని వల్ల ఏమి రకు ప్రయోజనాలు ఉన్నాయో నిర్ధారించాలని కోరారు.
విద్యుత్ బాధ్యత ఆ సంస్థకు ఇవ్వడం వల్ల వచ్చిన లాభం లేకపోగ పురపాలికలు ఆర్థికంగా నష్టపోయాయని తెలిపారు. పట్టణ ప్రగతి నిధులు 20నెలలుగా విడుదల కాకపోవడం వల్ల వాటిని ఆధారంగా చేసుకోని చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలో ఇబ్బందు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు విధించే అధికారం ఒకే విధంగా ఉండకుండా పన్నులను ఖరారు చేసే అధికారాలు స్థానిక సంస్థలకు ఇవ్వాలని సీఎం ను కోరారు. విలేకరుల సమావేశంలో చాంబర్స్ ప్రతినిధులు అల్లపల్లి నరసింహ, శాగంటి అనసూయ తదితరులు పాల్గోన్నారు.