Wednesday, January 22, 2025
spot_img

కవితమ్మ డాక్టర్‌కు చూపించుకుంటే మంచిది

Must Read
  • పసుపుబోర్డు వ్యాఖ్యలపై రఘునందన్‌ రావు సెటైర్లు

పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు సెటైర్లు వేశారు. కవిత మంచి డాక్టర్‌ కు చూపెట్టుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. జైల్లో ఉన్నప్పుడు కవిత ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి… చెల్లె కవిత ఇప్పటికి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది… మంచి డాక్టర్‌ కి చూపిస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ తర్వాత ప్రెస్‌ విూట్‌ పెడితే బాగుంటుందని రఘునందన్‌ రావు అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ కి రైతులు ఎందుకు గుర్తుకు రాలేదని రఘునందన్‌ రావు ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌ చుట్టూ ఉన్న గ్రామాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదు. అధికారం పోయాక రైతులపై కేటీఆర్‌ కి ప్రేమ పెరిగి రైతు ధర్నాలు చేస్తున్నాడని విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హయాం లోనే అంబేద్కర్‌ కి అవమానం జరిగింది. కాంగ్రెస్‌ ఐదున్నర దశాబ్దాలు అధికారంలో ఉండి ఏనాడూ అంబేద్కర్‌ ని గౌరవించలేదు.కేవలం అంబేద్కర్‌ జయంతి, వర్ధంతులు తప్ప కాంగ్రెస్‌ పార్టీ చేసింది ఏమి లేదు. 1950 లో నామినేటెడ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే జవహర్‌ లాల్‌ నెహ్రూ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. రెండోసారి ప్రధానిగా ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ తీసుకువచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని రఘునందన్‌ రావు విమర్శించారు.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS