Wednesday, January 22, 2025
spot_img

దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎంలు

Must Read
  • ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు
  • తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం

దావోస్‌(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అధికారులు ఉన్నారు. జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశం కానుంది. మరోవైపు దావోస్‌ సదస్సుకు వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు కాసేపు ముచ్చటించుకున్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్టాల్ర సీఎంలు స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. మరోవైపు జ్యురిచ్‌ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్‌పోర్టులో యూరప్‌ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు ఫొటోలు దిగారు.

తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ చేసుకుంది. ఆయనవెంట ఐటిశృాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటి సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఇతర ప్రతినిధులు ఉన్నారు. సింగపూర్‌ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి దావోస్‌ పర్యటనకు బయలు దేరింది. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో పాల్గొంటారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను తెచ్చే లక్ష్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి బృందం దావోస్‌ పర్యటనకు వెళ్లింది. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్‌ లో రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ప్రపంచ అగశ్రేణి పరిశ్రమలు, సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భేటీకానున్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్‌ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్‌ పర్యటన సందర్భంగా రాష్టాన్రికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సవిూకరించింది. ఈసారి అంతకు మించి పెట్టుబడులను తేవడమే లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల అధికారులతో సవిూక్షలో వెల్లడిరచారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, తయారీ రంగాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతోపాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ)పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాది దావోస్‌ పర్యటనతోపాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్టాన్రికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్‌ ల్యాండ్‌ కంపెనీ ముందుకు వచ్చింది. సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్‌ వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు జరిగే ’ప్రపంచ ఆర్థిక ఫోరం’ వార్షిక సదస్సులో ఈ బృందం పాల్గొననుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఈ సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఆ వేదికపై తెలంగాణలో కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించి, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేయనున్నారు.

Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS