- హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి…
- హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ప్రో.రాం రెడ్డి ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలో జరుగనుందని తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించి సికింద్రాబాద్ లోని సిఎస్ఐఐటి, వెస్లీ కాలేజ్ లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో జరుగుతుంది.
రేపు ఉదయం 8 గంటలకు 3 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని, మిగిలిన 12 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8.00కి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని తెలిపారు. . కౌంటింగ్ కోసం 12 వందల మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని అన్నారు.
హైదరాబాద్ జిల్లాలో 13 లోకేషన్లలో ఓట్ల లెక్కింపుకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో 20 టేబుల్స్, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ చొప్పున కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓట్ల లెక్కింపు యాకత్ పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 15 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు..
జిల్లా ఎన్నికల అధికారి వెంట సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ ఏ ఆర్ ఓ, హేమంత్ బోర్కడే సహదేవరావు, జూబ్లీహిల్స్ డి సి ప్రశాంతి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఏ ఆర్ ఓ దశరథ్ సింగ్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, యూసఫ్ గూడ డిప్యూటీ కమిషనర్ సేవాసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.